జనసేనాని పవన్ కళ్యాణ్ చాలా రోజుల అజ్ఞాతవాసం వీడి ఏపీ పర్యటన పెట్టుకున్నారు. రావడం రావడమే అధికార వైసీపీని టార్గెట్ చేశాడు. ఏపీ అసెంబ్లీలో నివర్ తుఫాన్ బాధితులకు న్యాయం చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పవన్ ఇప్పుడు పోరుబాటను అందిపుచ్చుకున్నారు.
Also Read: టీడీపీ ఆన్ ఫైర్
తిరుపతిలో మీడియాతో మాట్లాడిన పవన్ ‘జైకిసాన్’ పేరిట త్వరలోనే ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. మీరు మద్దతిస్తున్న బీజేపీ తెచ్చిన వ్యవసాయ చట్టాలను రైతులు వ్యతిరేకిస్తున్నారు కదా అన్న ప్రశ్నకు పవన్ ఆసక్తికరంగా స్పందించాడు. రైతుల మేలు కోసమే బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తెచ్చిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.
ఇక హైదరాబాద్ వరదల నేపథ్యంలో వరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం రూ.10వేలు ఇచ్చిందని జనసేనాని గుర్తు చేశారు. ఐదో, పదో ఇచ్చేసి చేతులు దులుపుకుందానే ఆలోచనలో వైసీపీ ఉందని.. అది మానుకోవాలని పవన్ సూచించారు.
Also Read: నవ్వులు పంచిన అసెంబ్లీ
రజినీకాంత్ రాజకీయాలపై పవన్ ఆసక్తికరంగా స్పందించాడు. ఇబ్బందులు లేకుండా.. కేసులు లేకుండా.. ఒక్క మాట పడకుండా.. చొక్కా నలగకుండా రాజకీయాలను ఎవరూ చేయలేరని పవన్ నొక్కిచెప్పాడు. దాడులకు గురైన కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్