https://oktelugu.com/

అయోధ్య ఆలయానికి కళ్లు చెదిరే విరాళాలు.. ఎన్ని వందల కోట్లో తెలుసా?

దేశ ప్రజల చిరకాల వాంఛ ‘అయోధ్య రామాలయం’. ఆ ఆలయం కోసం హిందువులు దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్నారు. ‘బాబ్రీ మసీదు’తో ముడిపడి ఉన్న ఈ ఆలయ వివాదాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించి అయోధ్య రామజన్మభూమికి ఆ వివాదాస్పద భూమిని ఇచ్చింది. ఇప్పుడు శంకుస్థాపన జరిగి నిర్మాణానికి అడుగులు పడ్డాయి. వేల కోట్లు ఖర్చు అయ్యే అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం జనవరి 15 నుంచి దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించారు. ఇది ఫిబ్రవరి 27 వరకు కొనసాగనుంది. అయితే ఆ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 13, 2021 / 08:19 PM IST
    Follow us on

    దేశ ప్రజల చిరకాల వాంఛ ‘అయోధ్య రామాలయం’. ఆ ఆలయం కోసం హిందువులు దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్నారు. ‘బాబ్రీ మసీదు’తో ముడిపడి ఉన్న ఈ ఆలయ వివాదాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించి అయోధ్య రామజన్మభూమికి ఆ వివాదాస్పద భూమిని ఇచ్చింది. ఇప్పుడు శంకుస్థాపన జరిగి నిర్మాణానికి అడుగులు పడ్డాయి.

    వేల కోట్లు ఖర్చు అయ్యే అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం జనవరి 15 నుంచి దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించారు. ఇది ఫిబ్రవరి 27 వరకు కొనసాగనుంది. అయితే ఆ గడువుకు ముందే శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ అనుకున్న లక్ష్యాన్ని చేరడం విశేషం.

    అయోధ్యలోని రామాలయ నిర్మాణానికి కులమతాలకు అతీతంగా విరాళాలు అందజేస్తున్నారు. అనుకున్న లక్ష్యాన్ని ముందుగానే ట్రస్ట్ చేరుకుంది. రామాలయం నిర్మాణం కోసం ఇప్పటివరకు రూ.1511 కోట్ల విరాళాలుగా అందాయి. ఈమేరకు ఆలయ ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి వివరాలు వెల్లడించారు.

    దేశవ్యాప్తంగా నాలుగు లక్షల గ్రామాలను సందర్శించి ప్రజల నుంచి విరాళాలు సేకరించామని కోశాధికారి తెలిపారు. 11 కోట్ల కుటుంబాలు విరాళాలు ఇచ్చాయి. కేవలం 29 రోజుల్లోనే ఈ నిధులు సమకూరాయని నిర్వాహకులు తెలిపారు. 492 సంవత్సరాల తర్వాత రామాలయాన్ని నిర్మించే అవకాశం దక్కిందని తెలిపారు. 1.50 లక్షల మంది వీహెచ్.పీ కార్యకర్తలు ఈ విరాళాల సేకరణలో భాగస్వామ్యులయ్యారు.