https://oktelugu.com/

మెహ్రీన్ ను పెళ్లి చేసుకోబోయే ఆ లక్కీ ఫెలో ఎవరో తెలుసా?

‘ఎఫ్2’ చిత్రంలో హనీ ఈజ్ ద బెస్ట్ అంటూ కుర్రకారు మతి పోగొట్టిన భామ ‘మెహ్రీన్’. అప్పుడెప్పుడో హీరో నానితో ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ అందం, అభినయం గల హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం ‘ఎఫ్3’లో నటిస్తోంది. అయితే త్వరలోనే మెహ్రీన్ పెళ్లి పీటలెక్కబోతోంది. ఈ మేరకు ఓ మాజీ సీఎం మనవడితో ఆమె పెళ్లి ఫిక్స్ అయినట్టు సమాచారం. హర్యానాకు చెందిన మాజీ సీఎం భజన్ లాల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 13, 2021 / 07:40 PM IST
    Follow us on

    ‘ఎఫ్2’ చిత్రంలో హనీ ఈజ్ ద బెస్ట్ అంటూ కుర్రకారు మతి పోగొట్టిన భామ ‘మెహ్రీన్’. అప్పుడెప్పుడో హీరో నానితో ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ అందం, అభినయం గల హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం ‘ఎఫ్3’లో నటిస్తోంది.

    అయితే త్వరలోనే మెహ్రీన్ పెళ్లి పీటలెక్కబోతోంది. ఈ మేరకు ఓ మాజీ సీఎం మనవడితో ఆమె పెళ్లి ఫిక్స్ అయినట్టు సమాచారం. హర్యానాకు చెందిన మాజీ సీఎం భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్ తో మెహ్రీన్ పెళ్లి నిశ్చయమైనట్టు సమాచారం.కాంగ్రెస్ నేత, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్ దీప్ బిష్ణోయ్ కుమారుడే భవ్య బిష్ణోయ్. హర్యానాలో బాగా పలుకుబడి ఉన్న రాజకీయ కుటుంబం వీరిది.

    కాగా వీళ్లిద్దరి పెళ్లికి పెద్దలు అంగీకారం తెలుపడంతో మెహ్రీన్, భవ్య కలిసి ఇప్పుడు విహారయాత్ర చేస్తున్నారు. కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరి నిశ్చితార్థాన్ని రాజస్థాన్ లోని జోధ్ పూర్ విల్లా ప్యాలెస్ లో మార్చి 13న నిర్వహిస్తున్నారు.

    మెహ్రీన్-భవ్య పెళ్లి పెద్దలు కుదిర్చిన పెళ్లిగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎఫ్3, కవచం సినిమాల్లో మెహ్రీన్ నటిస్తోంది.