https://oktelugu.com/

‘ఉప్పెన’ తీసుకొస్తున్న ఎన్టీఆర్

సుకుమార్ శిష్యుడు తీస్తున్న మూవీ ‘ఉప్పెన’. సుకుమార్ ఈ సినిమాకు కథ సహకారం అందిస్తున్నాడు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఈ సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్నాడు. చాలా రోజులుగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడిన మూవీని తాజాగా రిలీజ్ చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఉప్పెన మూవీని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడు. వైష్ణవ్ తేజ్ తన మొట్టమొదటి చిత్రం ఉప్పెన టీజర్.. పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్లలో రామ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 2, 2021 / 09:48 PM IST
    Follow us on

    సుకుమార్ శిష్యుడు తీస్తున్న మూవీ ‘ఉప్పెన’. సుకుమార్ ఈ సినిమాకు కథ సహకారం అందిస్తున్నాడు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఈ సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్నాడు. చాలా రోజులుగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడిన మూవీని తాజాగా రిలీజ్ చేస్తున్నారు.

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఉప్పెన మూవీని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడు. వైష్ణవ్ తేజ్ తన మొట్టమొదటి చిత్రం ఉప్పెన టీజర్.. పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్లలో రామ్ చరణ్, మహేష్ బాబు కూడా పాల్గొంటున్నారని తెలిసింది. తాజాగా వీరికి ఎన్టీఆర్ కూడా మద్దతు ఇస్తున్నారు.

    ఈ ట్రైలర్‌ను ఫిబ్రవరి 4న జూనియర్ ఎన్టీఆర్ లాంచ్ చేయబోతున్నాడు. ఉప్పెన మూవీ కథ ఏంటనేది టీజర్ ద్వారా ఎన్టీఆర్ ప్రపంచానికి చూపించబోతున్నాడు.

    వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా చేసింది. వైష్ణవ్ తేజ్ ఊర మాస్ యువకుడిగా కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌తో పాటు, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను నిర్మించింది. ఫిబ్రవరి 12న ఉప్పెన థియేటర్స్ లో విడుదలకు సిద్ధమవుతోంది.