https://oktelugu.com/

రైతుల ఉద్యమాన్ని ఆపేందుకు బీజేపీ దారుణాలివీ!

రైతులా..? వారు ఉగ్రవాదులా? వ్యవసాయ చట్టాలను ఆపేందుకు ఢిల్లీకి ఈనెల 6న రాబోతున్న రైతులను కట్టడి చేసేందుకు కేంద్రంలోని బీజేపీ దారుణాలకు పాల్పడుతోంది. ఏకంగా రోడ్లపైనే కాంక్రీట్ తో మొనదేలిన ఇనుప చువ్వలను పోతపోస్తోంది. భారీగా ఇనుప కంచెలను నిర్మిస్తోంది. నడిరోడ్డుపై రైతులను దాటకుండా పదునైన పెద్ద సూదులను అమర్చుతోంది. భారీ భారీకేడ్లను నిర్మిస్తోంది. ఈ దారుణాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తాజాగా వైరల్ అయ్యాయి. స్వయంగా రైతులను ఆపేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలను రాహుల్ గాంధీ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 2, 2021 / 10:01 PM IST
    Follow us on

    రైతులా..? వారు ఉగ్రవాదులా? వ్యవసాయ చట్టాలను ఆపేందుకు ఢిల్లీకి ఈనెల 6న రాబోతున్న రైతులను కట్టడి చేసేందుకు కేంద్రంలోని బీజేపీ దారుణాలకు పాల్పడుతోంది. ఏకంగా రోడ్లపైనే కాంక్రీట్ తో మొనదేలిన ఇనుప చువ్వలను పోతపోస్తోంది. భారీగా ఇనుప కంచెలను నిర్మిస్తోంది. నడిరోడ్డుపై రైతులను దాటకుండా పదునైన పెద్ద సూదులను అమర్చుతోంది. భారీ భారీకేడ్లను నిర్మిస్తోంది. ఈ దారుణాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తాజాగా వైరల్ అయ్యాయి.

    స్వయంగా రైతులను ఆపేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలను రాహుల్ గాంధీ ట్విట్టర్ లో షేర్ చేసి జరుగుతున్న దారుణాలపై నిలదీశారు.. రైతులను ఆపేందుకు గోడలు నిర్మించడం కాదని.. బ్రిడ్జీలు కట్టాలంటూ బీజేపీ పాల్పడుతున్న అనైతిక చర్యలను తూలనాడారు.

    ఫిబ్రవరి 6న రైతులు మరోసారి దేశవ్యాప్తంగా భారీగా ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా రోడ్లను దిగ్భంధించనున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ ఉద్యమానికి అన్ని రైతు సంఘాలు మద్దతు తెలిపాయి.

    దేశవ్యాప్తంగా రహదారుల దిగ్బంధానికి సిద్ధమైన రైతు ఉద్యమకారులను నిలువరించేందుకు బీజేపీ సర్కార్ దారుణాలకు పాల్పడుతోంది.రైతులను ఢిల్లీలోకి రాకుండా వస్తే ప్రాణాలు పోయేలా ఇలా కాంక్రీట్ పోతపోసి మరీ పదునైన దిగితే ప్రాణం పోయేలా రోడ్లపై ఏర్పాటు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో సిమెంట్, ఇనుప చువ్వలతో మేకులు, ఇనుప బారికడ్లతో రోడ్లపై గట్టిగా నిర్మిస్తున్నారు. పోలీసుల చేతివేళ్లకు రక్షణగా ఉండేందుకు స్లీల్ తొడుగు, మరో చేతికి డాలును పోలిన తొడుగును ధరిస్తున్నారు.