గతేడాది ప్రజలను గజగజా వణికించిన కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు రేయింబవళ్లు శ్రమించి కరోనా వ్యాక్సిన్లను తయారు చేసిన సంగతి తెలిసిందే. అయితే కరోనాకు వ్యాక్సిన్ వచ్చినా వెలుగులోకి వచ్చిన మరో కొత్తరకం ఫంగస్ ప్రజలను భయపెడుతోంది. భారత్ లోని సుదూర ప్రాంతాల్లో ఉన్న ఇసుక తిన్నెల్లో ఈ కొత్తరకం ఫంగస్ కనిపించింది. శాస్త్రవేత్తలు ఈ ఫంగస్ కరోనా తర్వాత ముంచుకొస్తున్న మరో పెద్ద మహమ్మారి అని అభిప్రాయపడుతున్నారు.
Also Read: కరోనాపై మరో షాకింగ్ న్యూస్.. ఆ అవయవానికి ప్రమాదం..?
ఈ కొత్తరకం ఫంగస్ ను అంతం చేయడం, ఫంగస్ వ్యాప్తికి చెక్ పెట్టడం అంత తేలిక కాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎంబయో అనే జర్నల్ లో ఈ కొత్తరకం ఫంగస్ గురించి కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ సూపర్ బగ్ ను కెండిడా ఆరిస్ లేదా సీ ఆరిస్ అని పిలుస్తారని సమాచారం. శరీరంపై గాయాల ద్వారా ఈ సూపర్ బగ్ శరీరంలో ప్రవేశిస్తుంది. ఈ సూపర్ బగ్ ను అంతం చేయడానికి మందులు వాడినా ఫలితం లేదని వైద్యులు చెబుతున్నారు.
Also Read: ఒకే డోసుతో కరోనా ఖతం..
శరీరంలోకి ఈ సూపర్ బగ్ చేరిన తర్వాత తీవ్రమైన అస్వస్థత కు దారి తీయడంతో పాటు ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సూపర్ బగ్ బారిన పడిన వాళ్లలో జ్వరం, జలుబు, ఇతర లక్షణాలు కనిపిస్తాయి. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఈ సూపర్ బగ్ వల్ల తీవ్రమైన బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్లు వస్తాయని వెల్లడించింది. గుంపుగా ఒక చోట చేరే మానవుల ద్వారా ఇది వ్యాపిస్తోందని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరిన్ని వార్తలు కోసం: కరోనా వైరస్
2009 సంవత్సరంలో శాస్త్రవేత్తలు తొలిసారి సీ ఆరిస్ అనే ఈ సూపర్ బగ్ ను గుర్తించారు. సీ ఆరిస్ కేసులు మరింత ఎక్కువగా నమోదైతే మాత్రం భవిష్యత్తులో ప్రజలు మరిన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది.