https://oktelugu.com/

గంగూలీకి యాంజియో ప్లాస్టీ.. గుండెలో మరో రెండు బ్లాక్ లు

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ ఉదయం సౌరవ్ గంగూలీకి గుండెపోటు వచ్చింది. ఉదయం ఎక్సర్ సైజులు చేస్తుండగా ఛాతినొప్పి రావడంతో కోల్ కతాలోని వుడ్ ల్యాండ్స్ ఆసుపత్రిలో గంగూలీ చేరాడు. ఈ క్రమంలోనే ఆయన గుండెలో బ్లాక్స్ ఉన్నాయని గుర్తించి ఆస్పత్రి వైద్యులు శనివారం యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యస్థితి నిలకడగా ఉందని.. పూర్తిగా సృహలోనే ఉన్నారని.. ఆయనకు ఆపరేషన్చేసిన డాక్టర్ ఆఫ్తాబ్ మీడియాకు తెలిపారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : January 2, 2021 / 06:37 PM IST
    Follow us on

    బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ ఉదయం సౌరవ్ గంగూలీకి గుండెపోటు వచ్చింది. ఉదయం ఎక్సర్ సైజులు చేస్తుండగా ఛాతినొప్పి రావడంతో కోల్ కతాలోని వుడ్ ల్యాండ్స్ ఆసుపత్రిలో గంగూలీ చేరాడు. ఈ క్రమంలోనే ఆయన గుండెలో బ్లాక్స్ ఉన్నాయని గుర్తించి ఆస్పత్రి వైద్యులు శనివారం యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యస్థితి నిలకడగా ఉందని.. పూర్తిగా సృహలోనే ఉన్నారని.. ఆయనకు ఆపరేషన్చేసిన డాక్టర్ ఆఫ్తాబ్ మీడియాకు తెలిపారు.

    Also Read: దేశమంతా కరోనా టీకా ఫ్రీ

    గంగూలీకి యాంజియోప్లాస్టీ నిర్వహించి ఒక స్టెంట్ ను వైద్యులు వేశారు. ఇంకా ఆయన గుండెలో మరో రెండు బ్లాక్స్ ఉన్నాయని..వీటికి చికిత్స అందిస్తున్నామన్నాని వైద్యులు తెలిపారు. ఆది, సోమవారాల్లో మరో రెండు స్టంట్లు గంగూలీ గుండెకు వేయనున్నారు.

    ఈ క్రమంలోనే వచ్చే 48 గంటల పాటు గంగూలీ ఆసుపత్రిలోనే ఉంటారని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. గంగూలీకి చికిత్స నిమిత్తం ముగ్గురు డాక్టర్లతో ఒక టీంను ఏర్పాటు చేసినట్లు కూడా వైద్యులు తెలిపారు.

    Also Read: పల్లెల నుంచే ఐటీ సేవలు

    గంగూలీ తన కూతురు సనాతో మాట్లాడారని.. చికిత్స కొనసాగుతోందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

    కాగా గంగూలీకి గుండెపోటు.. ఆపరేషన్ జరిగిందన్న వార్త తెలియగానే భారత క్రికెటర్లు, మాజీ క్రికెటర్లతోపాటు అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు. గంగూలీ త్వరగా కోలుకోవాలని క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, సెహ్వాగ్ సహా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్లు చేశారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్