https://oktelugu.com/

నితిన్ ‘రంగ్ దే’ మూవీ విడుదలకు రెడీ

టాలీవుడ్ సినిమా పట్టాలెక్కుతోంది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంతో టాలీవుడ్ లో కరోనా తర్వాత తొలి సినిమా విడుదలైంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కరోనా కల్లోలంలోనూ తన సినిమాను విడుదల చేసి అందరూ హీరోలకు ధైర్యం ఇచ్చారు. Also Read: సూపర్‌ స్టార్‌ నిర్ణయం పై మోహన్ బాబు రియాక్షన్ ! ఈ క్రమంలోనే ఈ సంక్రాంతి నుంచి టాలీవుడ్ మూవీల విడుదల అవుతున్నాయి. సంక్రాంతికి నాలుగు సినిమాలు థియేటర్లకు వస్తున్నాయి. ఇక […]

Written By:
  • NARESH
  • , Updated On : December 31, 2020 / 07:14 PM IST
    Follow us on

    టాలీవుడ్ సినిమా పట్టాలెక్కుతోంది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంతో టాలీవుడ్ లో కరోనా తర్వాత తొలి సినిమా విడుదలైంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కరోనా కల్లోలంలోనూ తన సినిమాను విడుదల చేసి అందరూ హీరోలకు ధైర్యం ఇచ్చారు.

    Also Read: సూపర్‌ స్టార్‌ నిర్ణయం పై మోహన్ బాబు రియాక్షన్ !

    ఈ క్రమంలోనే ఈ సంక్రాంతి నుంచి టాలీవుడ్ మూవీల విడుదల అవుతున్నాయి. సంక్రాంతికి నాలుగు సినిమాలు థియేటర్లకు వస్తున్నాయి.

    ఇక సమ్మర్ కు పెద్ద సినిమాలు వచ్చేందుకు క్యూలో ఉన్నాయి. ఈ కోవలోనే మార్చిలో యంగ్ హీరో నితిన్ ఖర్చీఫ్ వేసేశాడు. నితిన్-కీర్తి సురేష్ కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించిన సినిమా ‘రంగ్ దే’ విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. వెంకీ అట్లూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా దాదాపుగా రెడీ అయిపోయింది.

    Also Read: చరణ్ తో ‘జెర్సీ’ డైరెక్టర్ భారీ యాక్షన్ !

    ముందుగా ఈ సంక్రాంతికి రావాలనుకున్న పోటీ తీవ్రంగా ఉండడంతో వెనక్కి తగ్గారు. ఓటీటీకి ఇద్దామన్న ఆలోచనలు చేశారు. అయితే చివరకు మార్చిలోనే థియేటర్లలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు.

    మార్చి నుంచి 100శాతం అక్యూపెన్సీతో థియేటర్లు తెరిచే అవకాశం ఉంది. కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రజలకు వేసి ఫిబ్రవరిలో పూర్తయ్యే అవకాశాలున్నాయి. అందుకే మార్చి తరువాత నితిన్ తన ‘రంగ్ దే’ సినిమాను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. మార్చి 26న విడుదలైతే లాంగ్ వీకెండ్ వస్తుంది. హోలీ తదితర సెలవులున్నాయి. దీంతో ఈ డేట్ కే నితిన్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్