ఈ మధ్య కాలంలో పిల్లలు సరైన పోషకాలు లభించే ఆహారం కంటే జంక్ ఫుడ్ తినడానికే ఆసక్తి చూపుతున్నారు. అయితే పిల్లలకు సరైన ఆరోగ్య అలవాట్లు లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బడికి వెళ్లే విద్యార్థులు ఉదయం సమయంలో రోజూ గ్లాసు పాలు తాగడంతో పాటు ఇడ్లీ, దోసె, గుడ్డు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే మంచిది. పిల్లలు రోజూ కచ్చితంగా బ్రేక్ తినాలి.
Also Read: నల్ల బియ్యం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే నీరసంతో పాటు చేయాల్సిన పనులను వేగంగా, సక్రమంగా పూర్తి చేయలేరు. మధ్యాహ్నం భోజనంలో అన్నంతో పాటు పప్పు, కూరగాయలు, ఆకుకూరలతో చేసిన వంటలు తీసుకోవాలి. వీలైతే చపాతీలు కూడా తీసుకుంటే మంచిది. సాయంత్రం సమయంలో పిల్లలు ఒక గ్లాసు పాలతో పాటు అటుకులు, మరమరాలు, శనగలు, వేరుశనగ పప్పు, పళ్లు తీసుకోవాలి.
Also Read: డయాబెటిస్ రోగులు గుండెను కాపాడుకోవడం ఎలా అంటే..?
రాత్రి సమయంలో అన్నం లేదా చపాతీని కూరతో తీసుకుంటే మంచిది. రాత్రి సమయంలో పెరుగు లేదా మజ్జిగతో అన్నం తీసుకుంతే పిల్లలకు సరిపోతుంది. భోజనం తరువాత పిల్లలు ఏదో ఒక పండును తినాలి. పిల్లలు ఇదే సమయంలో నూనెతో వండిన వంటకాలకు, చిరుతిళ్లకు దూరంగా ఉంతే మంచిది. చిరుతిళ్లు రుచిగా ఉన్నా ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ వీలైనంత తక్కువగా తీసుకోవాలి.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
పిల్లలు ఆహారం సరైన సమయానికి తీసుకునే విధంగా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు రోజూ కనీసం గంట సమయం మైదానంలో ఆడుకోవాలి. పిల్లలు పడుకోవడం కంటే మూడు గంటల ముందే ఆహారం తీసుకుంటే మంచిది.