https://oktelugu.com/

నిహారికకు కరోనాపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు

మెగా ఫ్యామిలీని ఒక్కసారిగా కరోనా వైరస్ కమ్మేసింది. ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక-చైతన్య వివాహాన్ని రాజస్థాన్ లో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోనూ రిసెప్షన్ ను గ్రాండ్ గా ఇచ్చారు. ఆ తర్వాత క్రిస్మస్ వేడుకల్లోనూ మెగా ఫ్యామిలీ అంతా కలిసి పాల్గొన్నది. Also Read: నితిన్ ‘రంగ్ దే’ మూవీ విడుదలకు రెడీ అయితే ఈ వేడుకలు ముగిశాక నిహారిక-చైతన్య జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లారు. అక్కడ ఏకాంతంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : December 31, 2020 / 07:25 PM IST
    Follow us on

    మెగా ఫ్యామిలీని ఒక్కసారిగా కరోనా వైరస్ కమ్మేసింది. ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక-చైతన్య వివాహాన్ని రాజస్థాన్ లో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోనూ రిసెప్షన్ ను గ్రాండ్ గా ఇచ్చారు. ఆ తర్వాత క్రిస్మస్ వేడుకల్లోనూ మెగా ఫ్యామిలీ అంతా కలిసి పాల్గొన్నది.

    Also Read: నితిన్ ‘రంగ్ దే’ మూవీ విడుదలకు రెడీ

    అయితే ఈ వేడుకలు ముగిశాక నిహారిక-చైతన్య జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లారు. అక్కడ ఏకాంతంగా గడిపారు. అయితే ఇక్కడ మాత్రం రాంచరణ్, వరుణ్ తేజ్ ఇద్దరూ కరోనా బారినపడ్డారు.

    ఇద్దరికీ టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ క్రమంలోనే వీరితో చనువుగా ఉన్న నిహారిక పరిస్థితి ఏంటన్న ఆందోళన మెగా అభిమానుల్లో నెలకొంది.

    Also Read: సూపర్‌ స్టార్‌ నిర్ణయం పై మోహన్ బాబు రియాక్షన్ !

    దీనిపై తాజాగా నాగబాబు క్లారిటీ ఇచ్చాడు. తన కూతురు నిహారిక-చైతన్య మాల్దీవులకు వెళ్లేముందు ముంబై ఎయిర్ పోర్టులో పరీక్షలు చేయించుకున్నారని.. వారికి నెగెటివ్ వచ్చిందని.. ఆ తర్వాత వచ్చాక కూడా పరీక్షలు చేయించుకుంటే నెగెటివ్ వచ్చిందని నాగబాబు క్లారిటీ ఇచ్చారు.ఈ రెండు రిపోర్టుల్లోనూ ఇద్దరికీ నెగెటివ్ వచ్చిందని తెలిపారు. తన అల్లుడు కూతురు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని అభిమానులు కంగారు పడాల్సిన పనిలేదని క్లారిటీ ఇచ్చాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్