కరోనా మహమ్మరి ఏడాదికాలంగా ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. తాజాగా కరోనా రూపాంతరం చెంది కొత్త వైరస్ ను వ్యాపింపజేస్తుండటంతో అన్నిదేశాలు అప్రమత్తమవుతున్నాయి.
Also Read: ఈ కొత్త వైరస్ ఎలా వచ్చిందో తెలుసా..?
బ్రిటన్లో.. దక్షిణాఫ్రికాల్లో వెలుగు చూసిన కొత్తరకం వైరస్ వేగంగా విస్తరిస్తోంది. పాత కరోనా వైరస్ కంటే 70శాతం అధికంగా వ్యాపిస్తోంది. దీంతో యూరప్ దేశాలు ఇప్పటికే క్రిస్మస్.. న్యూయర్ వేడుకలు రద్దు చేసుకున్నాయి.
కొన్నిదేశాలు ముందస్తు జాగ్రత్తగా లాక్డౌన్ ను అమలు చేస్తున్నాయి. భారత్ సైతం కొత్త వైరస్ పై ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటుంది. బ్రిటన్ నుంచి గత రెండువారాలుగా ఇండియాకు వచ్చిన వారికి కరోనా టెస్టులు నిర్వహిస్తోంది.
Also Read: కరోనా కొత్త స్ట్రెయిన్.. ప్రపంచం అప్రమత్తం..!
ఈక్రమంలోనే బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో ప్రభుత్వం రాత్రివేళ కర్ఫ్యూ విధించింది. రాత్రి 10గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
ఈ కర్ఫ్యూ నేటి నుంచి జనవరి 2వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. కర్ణాటక బాటలోనే మిగతా రాష్ట్రాలు కూడా పయనించే అవకాశం కన్పిస్తోంది. ఇదంతా చూస్తుంటే కేంద్రం మరోసారి లాక్డౌన్ సిద్ధమవుతుందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్