ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్: ఎన్నికలకు సహకరించాలని ఆదేశం

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ కు సహకరించాలని సూచించింది. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి ముగ్గురు అధికారులు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ను కలవాలని చెప్పింది. కరోనా పరిస్థితులు, ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని, ఇందుకు ప్రభుత్వం సహకరించాలని ఆదేశించింది. గత కొన్ని రోజులుగా ఎన్నికల కమిషన్, ప్రభుత్వం మధ్య స్థానిక ఎన్నికలపై వివాదం కొనసాగుతోంది. వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని […]

Written By: Suresh, Updated On : December 23, 2020 1:53 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ కు సహకరించాలని సూచించింది. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి ముగ్గురు అధికారులు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ను కలవాలని చెప్పింది. కరోనా పరిస్థితులు, ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని, ఇందుకు ప్రభుత్వం సహకరించాలని ఆదేశించింది. గత కొన్ని రోజులుగా ఎన్నికల కమిషన్, ప్రభుత్వం మధ్య స్థానిక ఎన్నికలపై వివాదం కొనసాగుతోంది. వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ చెబుతున్నా.. కరోనా వ్యాప్తి ఇంకా తగ్గనందును ఇప్పడే ఎన్నికలు నిర్వహించొద్దని తెలిపింది. అయితే వ్యవహార కోర్టుకు వెళ్లడంతో తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.