హీరో రానా-సాయిపల్లవి జంటగా రూపొందుతున్న చిత్రం ‘విరాటపర్వం’. పొలిటికల్ పీరియాడిక్ థ్రిల్లర్ గా సినిమా తెరకెక్కుతోంది. పొలిటికల్ థ్రిల్లర్ అయినా కథలో మాత్రం కొత్త కోణాలు చాలా ఉన్నాయని.. ముఖ్యంగా రానా పాత్రలో కొంత నెగిటివ్ యాంగిల్ ఉంటుందని.. అది సినిమాలో కొత్తగా అనిపిస్తోందని.. మొత్తంగా మంచి కోసం పోరాడే ఓ చెడ్డ వాడి కథనే.. థ్రిల్లింగ్ అంశాలతో ఓ కొత్త కోణంలో డైరెక్టర్ వేణు ఉడుగుల చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రాంతంలోని 1980 – 90 నాటి సామాజిక పరిస్థితుల ఆధారం చేసుకుని ఈ పీరియాడిక్ సోషల్ డ్రామాను వేణు ఉడుగుల రాసుకున్నాడట. అంటే అప్పటి దళారుల వ్యవస్థను సినిమాలో మెయిన్ విలన్ గా చూపిస్తున్నారేమో. ఇక ఈ సినిమాను హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ కథలో రానా నక్సలైట్ గా నటిస్తున్నాడట.
ఈ చిత్రంలో ప్రియమణి ఒక కీలక పాత్రలో నటిస్తోంది. డి. సురేష్‌బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ ఫేమస్ నటి నందితా దాస్, ఈశ్వరీరావు, జరీనా వహాబ్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు.
కాగా ఈ సినిమా థియేటర్ హక్కులు ఎప్పుడో అమ్మేసారట.. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కూడా అమ్మేసినట్టు సమాచారం. అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ హోల్ సేల్ గా ఈ ‘విరాటపర్వం’ మూవీ హక్కులు తీసుకున్నట్టు టాక్. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం ఆన్ లైన్ స్ట్రీమింగ్ హక్కులను 11 కోట్లకు తీసుకున్నట్టు సమాచారం.
హీరో రానా హిందీతోపాటు దక్షిణాది భాషల్లో కూడా ప్రముఖ నటుడు కావడం వల్ల ఈ సినిమా ఆన్ లైన్ స్ట్రీమింగ్ రైట్స్ కు భారీ రేటు వచ్చినట్టు సమాచారం. ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.