https://oktelugu.com/

ఐటం సాంగ్ పై నిలదీసిన నెటిజన్ కు అనసూయ ఇచ్చిన సమాధానమిదీ

బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ.. టీవీల్లో ఆడిపాడినా.. సినిమాల్లో చిందులేసినా కూడా చూడని జనాలు లేవు. తన అందచందాలు అలా అలరిస్తాయి మరీ.. అయితే అప్పుడెప్పుడో తాను ఇక ఐటంసాంగ్ లు చేయనని.. ఇక మీదట ప్రత్యేక మంచి పాత్రలు దొరికితేనే చేస్తానని అనసూయ అన్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.ఆ కోవలోనే రంగస్థలంలో ‘రంగమ్మత్త’లాంటి పవర్ ఫుల్ పాత్రలో అనసూయ నటించి మెప్పించింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించింది. తాజాగా కార్తికేయ హీరోగా తెరకెక్కిన […]

Written By:
  • NARESH
  • , Updated On : March 2, 2021 / 09:25 PM IST
    Follow us on

    బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ.. టీవీల్లో ఆడిపాడినా.. సినిమాల్లో చిందులేసినా కూడా చూడని జనాలు లేవు. తన అందచందాలు అలా అలరిస్తాయి మరీ.. అయితే అప్పుడెప్పుడో తాను ఇక ఐటంసాంగ్ లు చేయనని.. ఇక మీదట ప్రత్యేక మంచి పాత్రలు దొరికితేనే చేస్తానని అనసూయ అన్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.ఆ కోవలోనే రంగస్థలంలో ‘రంగమ్మత్త’లాంటి పవర్ ఫుల్ పాత్రలో అనసూయ నటించి మెప్పించింది.

    ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించింది. తాజాగా కార్తికేయ హీరోగా తెరకెక్కిన ‘చావు కబురు చల్లగా’ మూవీలో అనసూయ ఒక ఐటెం సాంగ్ లో రెచ్చిపోయి నృత్యం చేసింది. ‘పైన పటారం.. లోన లోటారం’ అంటూ సాగే మాస్ మసాలా సాంగ్ లో కార్తికేయతో కలిసి అనసూయ చేసిన పాట ఆకట్టుకుంది.

    అయితే అనసూయ ఈ ఘాటు పదజాలంతో సాగే ఐటం సాంగ్ లో డ్యాన్స్ చేయడంపై కొందరు సోషల్ మీడియాలో ఆమెను ట్యాగ్ చేసి అడిగేశారు. ‘ఐటెం సాంగ్ లు చేయను అన్నారు కదా.. మరి ఇదేంటండి.. అయినా ఆ లిరిక్స్ ఏంది?’అడిగేశాడు.

    దానికి సీరియస్ అయిన అనసూయ ఏవో గాలి వార్తలు రాసిన వారిని నమ్ముతారా? నేను ఎప్పుడు ఆ ఐటెం సాంగ్ లు చేయను అనలేదని.. ఇది స్పెషల్ సాంగ్ అంటూ నెటిజన్ పై భగ్గుమంది.

    ఇన్నాళ్లు సాఫ్ట్ గా సాగిన అనసూయ మాటలు ఇప్పుడు హార్డ్ గా అనేసరికి అందరూ సోషల్ మీడియాలో ఆశ్చర్యపోతున్నారు.