సిమ్ కార్డులతో బ్యాంక్ ఖాతా ఖాళీ.. మోసగాళ్లు ఏం చేస్తున్నారంటే..?

ఈ మధ్య కాలంలో సైబర్ మోసగాళ్లు మనకు తెలియకుండానే మన బ్యాంక్ ఖాతాల్లోని నగదును మాయం చేస్తున్నారు. చదువుకున్న వాళ్లు, చదువుకోని వాళ్లు అనే తేడాల్లేకుండా అందరూ సైబర్ మోసాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఫోన్ పోగొట్టుకున్నా, సిమ్ కార్డ్ బ్లాక్ అయినా సైబర్ మోసాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. మన ఫోన్ సైబర్ మోసగాళ్ల చేతికి చిక్కితే వాళ్లు ఆ ఫోన్ ను వినియోగించి ఖాతాల్లో డబ్బు మాయం చేసే అవకాశం ఉంటుంది. Also […]

Written By: Kusuma Aggunna, Updated On : March 3, 2021 12:51 pm
Follow us on

ఈ మధ్య కాలంలో సైబర్ మోసగాళ్లు మనకు తెలియకుండానే మన బ్యాంక్ ఖాతాల్లోని నగదును మాయం చేస్తున్నారు. చదువుకున్న వాళ్లు, చదువుకోని వాళ్లు అనే తేడాల్లేకుండా అందరూ సైబర్ మోసాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఫోన్ పోగొట్టుకున్నా, సిమ్ కార్డ్ బ్లాక్ అయినా సైబర్ మోసాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. మన ఫోన్ సైబర్ మోసగాళ్ల చేతికి చిక్కితే వాళ్లు ఆ ఫోన్ ను వినియోగించి ఖాతాల్లో డబ్బు మాయం చేసే అవకాశం ఉంటుంది.

Also Read: నెలకు రూ.6వేలు చెల్లిస్తే కొత్తకారు మీ సొంతం.. ఎలా అంటే..?

ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే సిమ్ కార్డును బ్లాక్ చేయించి అదే నంబర్ తో సిమ్ కార్డ్ తీసుకోవాలి. కొంతమంది సైబర్ మోసగాళ్లు బ్యాంకు ఖాతాదారుల పేరు, అడ్రస్, బ్యాంకు వివరాలను దొంగిలించి ఆ వివరాలను మిస్ యూజ్ చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కొన్నిరోజుల క్రితం ఒక సైబర్ మోసగాడిని అరెస్ట్ చేయగా షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి.

Also Read: యాపిల్ ఫోన్ ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన మహిళ.. పార్సిల్ చూసి షాక్..?

సైబర్ మోసగాళ్లు సిమ్ కార్డు ద్వారా లింక్ అయిన బ్యాంకు అకౌంట్లను కనిపెట్టి కొన్ని కోడ్స్ ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో కనిపెడతారు. ఆ తరువాత ఖాతాదారులకు మొబైల్ నంబర్ ను ఉపయోగించి పిన్ ను ఛేంజ్ చేసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత డేటా, బ్యాంకుల వంటి వివరాలను మొబైల్ ఫోన్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ సేవ్ చేయకూడదు. సైబర్ మోసగాళ్లు కొత్త టెక్నాలజీల ద్వారా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలను కలిగి ఉండేవాళ్లు, బ్యాంకులో ఎక్కువ మొత్తం బ్యాలెన్స్ ఉన్నవాళ్లు సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. సైబర్ మోసాల గురించి అవగాహన లేకపోతే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.