పిల్లిని పట్టిస్తే 15 వేల రూపాయలు.. ఎక్కడంటే..?

సాధారణంగా మనుషులు లేదా విలువ చేసే వస్తువులు తప్పిపోయినా/ పోగొట్టుకున్నా రివార్డులు ప్రకటిస్తారనే సంగతి తెలిసిందే. అయితే ఒక మహిళ మాత్రం యూపీలోని గోరఖ్ పూర్ లోకనిపించకుండా పోయిన ఒక పిల్లిని పట్టిస్తే 15 వేల రూపాయలు ఇస్తానని ప్రకటించారు. పిల్లిని పట్టిస్తే 15 వేల రూపాయలు ఇవ్వడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా..? ప్రేమతో పెంచుకున్న పెంపుడుపిల్లి కనిపించకపోవడంతో ఆ మహిళ ఈ నిర్ణయం తీసుకున్నారు. భార‌త్‌లోని మాజీ ఎన్నికల అధికారి ఎస్‌వై ఖురేషీ భార్య ఇల శ‌ర్మ […]

Written By: Navya, Updated On : November 15, 2020 9:11 am
Follow us on


సాధారణంగా మనుషులు లేదా విలువ చేసే వస్తువులు తప్పిపోయినా/ పోగొట్టుకున్నా రివార్డులు ప్రకటిస్తారనే సంగతి తెలిసిందే. అయితే ఒక మహిళ మాత్రం యూపీలోని గోరఖ్ పూర్ లోకనిపించకుండా పోయిన ఒక పిల్లిని పట్టిస్తే 15 వేల రూపాయలు ఇస్తానని ప్రకటించారు. పిల్లిని పట్టిస్తే 15 వేల రూపాయలు ఇవ్వడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా..? ప్రేమతో పెంచుకున్న పెంపుడుపిల్లి కనిపించకపోవడంతో ఆ మహిళ ఈ నిర్ణయం తీసుకున్నారు.

భార‌త్‌లోని మాజీ ఎన్నికల అధికారి ఎస్‌వై ఖురేషీ భార్య ఇల శ‌ర్మ ప్రేమతో అల్లారుముద్దుగా ఒక పిల్లిని పెంచుకునేవారు. రోజంతా ఏ పని చేసినా ఆ పెంపుడు కుక్క తనతో ఉండే విధంగా జాగ్రత్త పడేవారు. ఇతర ప్రాంతాలకు ఏ మీద వెళ్లినా పెంపుడు పిల్లి తప్పనిసరిగా ఉండాల్సిందే. అలా ఢిల్లీకి వెళ్లడం కోసం యూపీలోని గోర‌ఖ్‌పూర్ రైల్వే స్టేష‌న్‌లో మహిళ కూతురు సాచి, డ్రైవ‌ర్ సురేంద‌ర్, పెంపుడు పిల్లితో ఎదురు చూస్తున్నారు.

అయితే రైల్వే స్టేషన్ లో రైళ్ల శబ్దానికి ఆ పిల్లి బెదిరిపోయింది. భయంతో ఆ పిల్లి అక్కడినుంచి పారిపోయింది. పిల్లి వయస్సు రెండున్నర సంవత్సరాలని.. ముక్కు మీద గోధుమ రంగు మ‌చ్చ, ఆకుపచ్చని కళ్లు ఉంటాయని సమాచారం. ప్రస్తుతం గోరఖ్ పూర్ నగరమంతా పిల్లికి సంబంధించిన పోస్టర్లే దర్శనమిస్తున్నాయి. మొదట పిల్లిని తెచ్చిచ్చిన వాళ్లకు 11 వేల రివార్డ్ ప్రకటించగా ఆ తర్వాత రివార్డ్ ను 15 వేల రూపాయలకు పెంచారు.

రోజులు గడిచినా పిల్లి చెంతకు చేరకపోవడంతో ఇల శర్మ రైల్వే స్టేషన్ లోనే ఉండి పిల్లి కోసం వెతుకున్నారు. ఆ పిల్లి దొరుకుతుందో లేదో చూడాల్సి ఉంది. శుక్రవారం రోజున ఈ ఘటన చోటు చేసుకోగా ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.