ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. అంచనాలకు అందని స్థాయిలో కరోనా కేసులు, కరోనా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని వార్తలు వస్తున్నా వ్యాక్సిన్ ఖచ్చితంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కరోనా వ్యాక్సిన్ రాకముందే ప్రజలు హెర్డ్ ఇమ్యూనిటీ పొందే అవకాశం ఉందని చెప్పారు.
త్వరలో కరోనా వైరస్ తో పోరాడగల రోగనిరోధక శక్తి ప్రజల్లో వస్తుందని అప్పుడు కరోనా వ్యాక్సిన్ యొక్క అవసరం ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ప్రజలు హెర్డ్ ఇమ్యూనిటీ సాధిస్తే కరోనా వ్యాక్సిన్ తో అవసరం లేకపోయినా వైరస్ లో మార్పులు వస్తే రీ ఇన్ఫెక్షన్ ను నివారించడం కోసం మాత్రం వ్యాక్సిన్ ను వేయించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
భవిష్యత్తులో కరోనా వైరస్ స్పందించే తీరును బట్టి కరోనా వ్యాక్సిన్ ను తీసుకునే విషయంలో ఒక అవగాహనకు రావచ్చని ఆయన వెల్లడించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల కరోనా వ్యాక్సిన్లు ప్రస్తుతం తుది దశ క్లినికల్ ట్రయల్స్ ను జరుపుకుంటున్నాయి. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్ లో ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ ను అందించడంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఆ సవాళ్లను అధిగమించడానికి కేంద్రం ఇప్పటినుంచే ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
మరోవైపు రోజులు గడుస్తున్నా ప్రజల్లో కరోనా భయం తగ్గడం లేదు. ఎప్పుడు, ఎక్కడ ఎవరినుంచి వైరస్ సోకుతుందో అర్థం కాక ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ నిబంధనలు పాటించి మాత్రమే వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశాలు ఉన్నాయి.