https://oktelugu.com/

ఎస్బీఐలో జీతానికి 24 రెట్లు లోన్.. పొందాలంటే అర్హతలు ఇవే..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది. కొత్త కొత్త ఆఫర్లను అందుబాటులోకి తెస్తూ ఖాతాదారులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. ఇతర బ్యాంకులతో పోలిస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు సులభంగా రుణాలను మంజూరు చేస్తోంది. కొన్ని అర్హతలు ఉన్నవాళ్లు సులువుగా పర్సనల్ లోన్ ను తీసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పర్సనల్ లోన్ తీసుకోవాలనే ఆసక్తి ఉండి కొన్ని అర్హతలు ఉంటే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 15, 2020 / 09:18 AM IST
    Follow us on


    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది. కొత్త కొత్త ఆఫర్లను అందుబాటులోకి తెస్తూ ఖాతాదారులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. ఇతర బ్యాంకులతో పోలిస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు సులభంగా రుణాలను మంజూరు చేస్తోంది. కొన్ని అర్హతలు ఉన్నవాళ్లు సులువుగా పర్సనల్ లోన్ ను తీసుకోవచ్చు.

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పర్సనల్ లోన్ తీసుకోవాలనే ఆసక్తి ఉండి కొన్ని అర్హతలు ఉంటే నెలవారీ జీతానికి ఏకంగా 24 రెట్లు ఎక్కువ మొత్తం వేతనం రూపంలో పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇంత భారీ మొత్తంలో లోన్ పొందాలనుకునే వాళ్లు రుణం పొందాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ అకౌంట్ ను కలిగి ఉండాలి. కనీసం 15,000 రూపాయల చొప్పున నికర వేతనాన్ని బ్యాంకులో జమ చేయాల్సి ఉంటుంది.

    ఎన్ఎంఐ రేషియో లేదా ఈఎంఐ కనీసం 50 శాతం కంటే దిగువన ఉంటే మాత్రమే ఈ రుణం పొందడానికి అర్హత ఉంటుంది. 10.6 శాతం వడ్డీ ఉండే ఈ రుణాలకు వేతనాన్ని బట్టి లక్ష నుంచి 20 లక్షల రూపాయల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. 21 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్లు ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం సంవత్సరం నుంచి కంపెనీలో పని చేసే వాళ్లు ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

    కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేసే వాళ్లు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర బ్యాంకులతో పోలిస్తే తక్కువ వడ్డీకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.