బాలీవుడ్ భారీ బ్యూటీ ‘నేహా ధూపియా’ మరోసారి తల్లి కాబోతుంది. తాను మళ్ళీ గర్భం దాల్చిన విషయాన్ని ఈ ఫేడ్ అవుట్ హీరోయిన్ సోషల్ మీడియాలో ఘనంగా చాటుకుంది. 2018లో అంగడ్ బేడీ అనే పెద్దగా గుర్తింపు లేని నటుడిని పెళ్లి చేసుకొని, ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగు పెట్టింది నేహా ధూపియా. అయితే, పెళ్ళైన ఏడాదికే అంగడ్ – నేహా జంటకు ఒక కూతురు పుట్టింది.
ఇప్పుడు నేహా ధూపియా తన రెండో బేబీకి కూడా జన్మనివ్వబోతోందని తెలిసి.. హిందీ నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే కొంతమంది ఆకతాయిలు మాత్రం ‘ఈ వయసులో మళ్ళీ మీరు గర్భవతి అవడం అవసరమా ?’ అంటూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ నేహా ధూపియా వయసు ఎంతంటే.. ప్రస్తుతం ఆమెకు 40 సంవత్సరాలు.
అయినా తల్లి అవ్వాలనే తన కోరిక ముందు వయసు అనేది ఒట్టి నెంబర్ మాత్రమే అంటూ నేహా ధూపియా చెప్పుకొచ్చింది. ఇక తెలుగులో మాజీ లవర్ బాయ్ తరుణ్ నటించిన ‘నిన్నే ఇష్టపడ్డాను’, అలాగే సీనియర్ హీరో రాజశేఖర్ సరసన ‘విలన్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది నేహా ధూపియా. కానీ తెలుగులో ఈ బ్యూటీకి బ్రేక్ రాలేదు.
అలా అని హిందీలో వచ్చింది అనుకునేరు. హిందీలో సైతం అమ్మడికి పెద్ద నిరాశే మిగిలింది. బాలీవుడ్ లో సింగ్ ఈజ్ కింగ్, హే బేబీ వంటి చిత్రాల్లో నటించినా హీరోయిన్ గా నిలబడలేక పోయింది. కానీ, యాంకర్ గా మాత్రం నేహా ధూపియా బాగానే రాణించింది.