చైనా వైరస్ దేశంలో రోజురోజుకు విభృంభిస్తుంది. దీంతో కేంద్రం లాక్డౌన్ కొనసాగిస్తున్న సంగతి తెల్సిందే. అయితే ప్రస్తుతం దేశంలో జూన్ 30వరకు లాక్డౌన్ 5.0కొనసాగునుంది. కేంద్రం ఇటీవల కాలంలో అన్నిరంగాలకు భారీ సడలింపులను లిస్తూ ఆన్ లిక్ దిశగా వెళుతుంది. అయితే కొన్ని షరతులను విధిస్తుంది. ముఖ్యంగా వైరస్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఈ నిబంధనలను ఆయా ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో మహమ్మరి ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఈ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో అక్కడి ప్రభుత్వాలు కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు.
ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వాడటం వంటివి చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చింది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం సెలూన్ షాపుల్లో హెయిర్ కటింగ్ చేయించుకునే వాళ్లు తప్పనిసరిగా ఆధార్ తీసుకెళ్లాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఆధార్ కార్డు లేకుండా సెలూన్ షాపులకు వెళితే అక్కడ క్షవరం చేయరు. దీంతో కటింగ్ చేయించుకోవాలనే వ్యక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు ఆధార్ జిరాక్స్ వెంట తీసుకెళ్లాల్సిందే. లేకుండా కటింగ్ నిరాకరిస్తారు. తెలంగాణలో కటింగ్ షాపులకు వెళ్లేవారు వారి వెంట ఇంటి నుంచే టవల్ వెంట తీసుకెళుతున్నారు. టవల్ ఉంటే కటింగ్ చేయాలనే నిబంధన ఉంది.
సెలూన్ షాపుల ద్వారా వైరస్ ప్రబలే అవకాశం ఉండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి కొత్త నిబంధనలు తీసుకొస్తున్నాయి. ఎవరైనా వైరస్ బారిన పడితే ఆధార్ కార్డు సాయంతో వారిని గుర్తించడం సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. దీని ద్వారా త్వరగా కాంటాక్టులను కనుగోనడం ద్వారా ఎక్కువ మంది వైరస్ సోకకుండా అరికట్టవచ్చని తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో 23,495 కరోనా కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 10,141 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వైరస్ తో 184 మంది మృతిచెందినట్లు సమాచారం. తమిళనాడు ప్రభుత్వం తాజా నిబంధనలు పట్ల ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి.