స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పోచారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశంలో ఎక్కడాలేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించామని, కాళేశ్వరం నీటిని అందించేందుకు పనులు జరుగుతున్నాయన్నారు.