https://oktelugu.com/

రూపం మార్చుకుంటున్న కరోనా వైరస్.. మరింత వేగంతో..?

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య్ తగ్గుతుండగా వైరస్ కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి. తాజాగా కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ రూపాన్ని మార్చుకుంటుండగా గతంతో పోలిస్తే రూపం మార్చుకున్న వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. రష్యాకు చెందిన ఓ వైద్యాధికారి మాట్లాడుతూ కరోనా వైరస్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 18, 2020 8:19 am
    Follow us on


    భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య్ తగ్గుతుండగా వైరస్ కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి. తాజాగా కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ రూపాన్ని మార్చుకుంటుండగా గతంతో పోలిస్తే రూపం మార్చుకున్న వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

    రష్యాకు చెందిన ఓ వైద్యాధికారి మాట్లాడుతూ కరోనా వైరస్ రూపం మార్చుకుందని.. సైబీరియాలో రూపం మార్చుకున్న వైరస్ ను గుర్తించామని తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి రష్యాలో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండగా ప్రతిరోజూ వందల సంఖ్యలో అక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. వైరస్ లో చోటు చేసుకున్న మార్పులే కేసుల సంఖ్య పెరగడానికి, కరోనా మరణాలకు కారణమని తెలుస్తోంది.

    రష్యా వైద్యాధికారులు స్వయంగా రూపం మార్చుకున్న వైరస్ కరోనా వ్యాప్తికి కారణమని చెప్పడంతో రష్యా ప్రజలు సైతం భయాందోళనకు గురవుతున్నారు. రష్యా వైద్యాధికారి అన్నా పొపోవా మాట్లాడుతూ దేశంలో కరోనా వైరస్ మ్యుటేషన్ చెందిందని.. మ్యుటేషన్ వల్ల ప్రమాదం లేకపోయినా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడవచ్చని చెప్పారు.

    కరోనా వైరస్ వ్యాప్తి గురించి, కరోనా వైరస్ ఎంత ప్రమాకరమో తెలుసుకోవడం గురించి అధ్యయనాలు చేస్తున్నామని పరిశోధనలు పూర్తైన తరువాత మరిన్ని విషయాలను వెల్లడిస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది.