https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా ఎమోషన్ ఓ రేంజ్ లో.. !

బాలీవుడ్ లో ఎంత సపోర్ట్ ఉన్నా అక్కడ్ స్టార్ హీరోయిన్ గా చలామణి అవ్వడం అంటే.. అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. గొప్ప గొప్ప నటీమణులే కొన్ని సినిమాలకే పరిమితం అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ, హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కొన్ని నెలలకే స్టార్ హీరోయిన్ అనే ముద్ర తెచ్చుకోవడం అంటే మాటలు కాదు, అది ఆలియా భట్ కే సాధ్యం అయింది. ఒక్కో సినిమాకి 8-10 కోట్ల పారితోషికం అందుకునే రేంజ్ కి […]

Written By:
  • admin
  • , Updated On : December 10, 2020 / 03:39 PM IST
    Follow us on


    బాలీవుడ్ లో ఎంత సపోర్ట్ ఉన్నా అక్కడ్ స్టార్ హీరోయిన్ గా చలామణి అవ్వడం అంటే.. అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. గొప్ప గొప్ప నటీమణులే కొన్ని సినిమాలకే పరిమితం అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ, హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కొన్ని నెలలకే స్టార్ హీరోయిన్ అనే ముద్ర తెచ్చుకోవడం అంటే మాటలు కాదు, అది ఆలియా భట్ కే సాధ్యం అయింది. ఒక్కో సినిమాకి 8-10 కోట్ల పారితోషికం అందుకునే రేంజ్ కి వెళ్లినా.. డైరెక్టర్లకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది ఆలియా. నిజానికి ఆలియా ఇప్పటికిప్పుడు వరుసగా నాలుగైదు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. అయినా ఆర్ఆర్ఆర్ కి ఎలాంటి ట్రబుల్ ఇవ్వకుండా డేట్స్ కేటాయిస్తూ.. షూట్ లో జాయిన్ అయ్యింది.

    Also Read: విజయ్ దేవరకొండకు లిప్ కిస్ ఇస్తానంటున్న తమన్నా

    కాగా రామ్ చరణ్ ఇందులో స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. అతడి సరసన సీత పాత్రలో అలియా నటిస్తోంది. అయితే ప్రస్తుతం ఆలియా పై కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను తీస్తున్నాడు రాజమౌళి. కాగా ఈ సీన్స్ వెరీ ఎమోషనల్ గా ఉంటాయని.. ఆలియా ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటిస్తోందని తెలుస్తోంది. అన్నట్టు అజేయ్ దేవగన్ కూడా షూట్ లో జాయిన్ అయ్యాడు. ఈ సినిమాలో సెకెండ్ హాఫ్ లో అజేయ్ దేవగన్ రోల్ వస్తోందట. ఎక్కువుగా ఎన్టీఆర్ కాంబినేషన్ లోనే ఆయన సీన్స్ ఉంటాయట.

    Also Read: రామ్ చరణ్ కొత్త సినిమా ఓపెనింగ్ డేట్ ఫిక్స్ !

    ఇక ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ ను హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమె పై ఇప్పటికే షూట్ చేశారు. కాగా సుమారు రూ.400 కోట్ల వ్యయంతో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అన్ని సాంగ్స్ కీరవాణి ఇప్పటికే పూర్తి చేశాడట. ఏది ఏమైనా ‘బాహుబలి’ సిరీస్ అనంతరం రాజమౌళి నుండి వస్తున్న ప్రాజెక్ట్ కావడం, పైగా ఇద్దరు స్టార్ హీరోలతో బాలీవుడ్ స్టార్స్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు ఉన్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్