Modi Rice: What is the ‘fortified rice’ that Prime Minister Modi is bringing for the people of the country? : సాధారణంగా గృహిణిగా ఉండే ప్రతీ మహిళకు ఉదయమే పని మొదలవుతుంది. ఇల్లు శుభ్రం నుంచి మొదలు కుటుంబానికి ఆహారం అందించే వరకు మహిళలు తీరిక లేకుండా కష్టపడుతారు. ఈ క్రమంలో స్త్రీలల్లో ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. దీంతో వారికి బలవర్ధకమైన ఆహారం అవసరం ఉంటుంది. అయితే చాలా మంది నేటి మహిళలు పౌష్టికాహారం తీసుకోవడం లేదు. అంటే వారు తీసుకునే ఆహారంలోనే విటమిన్స్ ఉండడం లేదు. దీంతో 30 ఏళ్లు దాటిన మహిళలు చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. పూర్వకాలంలో మహిళలు ఇంటి పనులతో పాటు వ్యవసాయం చేసేవారు. కానీ నేటి మహిళలు ఇంటిపనులకే అలసిపోతున్నారు. అందుకు ప్రధాన కారణం వారు తీసుకుంటున్న ఆహార లోపమేనంటున్నారు వైద్య నిపుణులు.
కేంద్రప్రభుత్వం ఇటీవల బలవర్ధక బియ్యం(పోర్టిఫికేషన్)ను పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో పౌష్టికాహార లోపాన్ని నివారించవచ్చని అంటున్నారు. అసలు బలవర్ధక బియ్యం అంటే ఏమిటి..? దానిని ఎలా తయారు చేస్తారు..? సాధారణంగా బియ్యం పాలిష్ చేయకుండా ఎవరూ వండుకోరు. అలా పాలిష్ చేయడం వల్ల అందులో ఉండే ఖనిజాలు, పోషకాలు పోతున్నాయి. అయితే బియ్యం పాలిష్ చేయకపోవడం వల్ల మలినాలు ఉంటాయని కొందరి వాదన. ఈ సమస్యను నివారించడానికి పోర్టిఫికేషన్ రైస్ ను పంపిణీ ఒక్కటే మార్గమని అంటున్నారు.
భారతదేశ వ్యాప్తంగా పోషకాహార లోపాన్ని నివారించడానికి ఫోర్టిఫికేషన్ రైస్ ను పంపిణీ చేస్తామని ప్రధాన మంత్రి మోడీ ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. దీనిని ముందుగా మధ్యాహ్న భోజన పథకాల ద్వారా ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఫోర్టిఫైడ్ రైస్ సరఫరా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఫోర్టిఫికేషన్ బియ్యాన్ని ఎలా తయారు చేస్తారనేది ఆసక్తిగా మారింది.
సాధారణంగా వరి పంట ద్వారా బియ్యం వస్తాయి. అలా వచ్చిన బియ్యాన్ని పాలిష్ చేసిన తరువాత పంపిణీ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల బియ్యంలో ఉండే ఖనిజాలు పోతున్నాయి. అయితే ‘బియ్యాన్ని పిండి చేసి అందులో ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్స్ ఆఫ్ ఇండియా ఆమోదించిన మోతాదులో విటమిన్లు, ఖనిజాలను కలిపి తిరిగి బియ్యపు గింజలుగా మారుస్తారు.వీటిని ఫోర్టిఫైడ్ రైస్ అంటారు’ అని న్యూయార్క్ చెందిన బయోలాజికల్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బబనెలకొన్న పోషకాహార లోపాన్ని నివారించడానికి బియ్యంతో పాటు ఇతర పప్పు ధాన్యాలకు ఖనిజాలు, లవణాలను జత చేయడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆహార వ్యవసాయ సంస్థ కలిసి ఈ ప్రక్రియను చేపట్టాయి.
ఫోర్టిఫైడ్ రైస్ తయారు చేయడానికి హైదరాబాద్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్(ఐసీఏఆర్)లో పరిశోధన నిర్వహించారు. ఫోర్టిఫైడ్ రైస్ తయారు చేయడానికి 135 రోజులు పడుతుంది. హెక్టారుకు 50 క్వింటాళ్ల దిగబడి ఇవ్వగా బియ్యాన్ని పాలిష్ చేసినా కూడా అందులో జింక్ అధికంగా ఉంటుందని ఐసీఏఆర్ పేర్కొంది. డీడీ ఆర్ ధన్ 45 అనే వరి రకాన్ని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పండించవచ్చని, దీని ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ తయారు చేయొచ్చని వారు తెలిపారు.
ఫోర్టిఫైడ్ రైస్ తినడం వల్ల వచ్చే ప్రయోజనాలేంటి..? మహిళల్లో ముఖ్యంగా రక్తహీనత లోపం అధికంగా ఉంటుంది. వీటికి ఇనుము, జింక్ విటమిన్ల లోపమేనంటున్నారు. అయితే ఈ రైస్ కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఈ లోపాన్ని నివారించవచ్చని గజపతినగరానికి చెందిన డాక్టర్ బిఎస్ ఆర్ మూర్తి తెలిపారు. ప్రతి కిలో ఫోర్టిఫైడ్ రైస్ లో 28 మిల్లీ గ్రాముల ఇనుము, 75 నుంచి 125 మిల్ల గ్రాముల ఫోలిక్ యాసిడ్ ఉంటుందని ఎప్ఎస్ ఏ పేర్కొంటోంది.