https://oktelugu.com/

Tokyo Paralympics: పోలియో వచ్చినా.. పారా ఒలింపిక్స్ విజేత ప్రమోద్ భగత్ జీవిత కథ

Tokyo Paralympics: జీవితం ఎవరికి వడ్డించిన విస్తరికాదు. ఏదైనా శోధించి సాధించాలి. మన పట్టుదల, శ్రమ, అకుంఠిత దీక్షతోనే గమ్యం చేరుకుంటాం. ఇది చరిత్రలో ఎందరో నిరూపించారు. దానికి ఎవరు మినహాయింపు కాదు. వెయ్యి అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభిస్తాం. ఇది గుర్తెరిగిన వారెవరు కూడా అనుత్తీర్ణులు కాలేదు. అందరు విజయం సాధించారు. దానికి కావాల్సిందల్లా ఓర్పు. అది ఉన్న వారెవరు కూడా వెనుదిరగలేదు. ఈ విషయం తెలుసుకున్న వారందరు తమ జీవిత సాఫల్యాన్ని సాధించుకున్నారు. […]

Written By: , Updated On : September 5, 2021 / 09:41 AM IST
Follow us on

Tokyo Paralympics Winner Pramod Bhagat

Tokyo Paralympics: జీవితం ఎవరికి వడ్డించిన విస్తరికాదు. ఏదైనా శోధించి సాధించాలి. మన పట్టుదల, శ్రమ, అకుంఠిత దీక్షతోనే గమ్యం చేరుకుంటాం. ఇది చరిత్రలో ఎందరో నిరూపించారు. దానికి ఎవరు మినహాయింపు కాదు. వెయ్యి అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభిస్తాం. ఇది గుర్తెరిగిన వారెవరు కూడా అనుత్తీర్ణులు కాలేదు. అందరు విజయం సాధించారు. దానికి కావాల్సిందల్లా ఓర్పు. అది ఉన్న వారెవరు కూడా వెనుదిరగలేదు. ఈ విషయం తెలుసుకున్న వారందరు తమ జీవిత సాఫల్యాన్ని సాధించుకున్నారు. అతడికి చిన్నప్పుడే పోలియో వచ్చింది. కాలు చచ్చుబడి పోయింది. కానీ అతడు నిరాశ చెందలేదు. అనుకున్న లక్ష్యం కోసం కఠోర శ్రమ చేశాడు. గమ్యాన్ని సాధించాడు.

దేశానికి బంగారు పతకం తీసుకురావడం అంటే మాటలు కాదు. దానికి ఎంతో శ్రమ కావాలి. పోలియో బారిన పడినా కుంగిపోలేదు. తన తండ్రి ఆశయ సాధనకు విరామం లేకుండా కృషి చేశాడు. బ్యాట్మింటన్ లో దేశానికి తొలి స్వర్ణం అందించాడు. 1988 జూన్ 4న ఒడిశాలో జన్మించిన ప్రమోద్ భగత్ (Pramod Bhagat) జన్మించాడు. చిన్న వయసులోనే పోలియో బారిన పడ్డాడు. కాలు చచ్చుబడిపోయింది. విషయం తెలుసుకున్న తండ్రి బాధపడలేదు. కొడుకును బ్యాట్మింటన్ క్రీడాకారుడిగా చేయాలని భావించాడు. దీంతో అతడిని అందుకు సిద్దం చేశాడు.

ప్రమోద్ భగత్ టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు స్వర్ణం అందించాడు. ఇదే తొలి స్వర్ణం కావడం గమనార్హం. ప్రమోదో ఫైనల్స్ లో ప్రపంచ నెంబర్ టూ ర్యాంకర్, గ్రేట్ బ్రిటన్ షట్లర్, గ్రేట్ బ్రిటన్ షట్లర్ డేనియల్ బెథిల్ ను 21-11 21-16 తేడాతో ఓడించాడు. పారాలింపిక్స్ లో భారత్ కు బ్యాట్మింటన్ లో తొలి పతకం రావడం విశేషం. దీంతో దేశం గర్వించదగ్గ రీతిలో భగత్ పేరు సంచలనంగా మారింది.

ప్రమోద్ భగత్ బ్యాట్మింటన్ ఆటకు ఆకర్షితుడయ్యాడు. పక్కనున్న వాళ్లు ఆడుతుంటే ప్రమోద్ చూసి తన లక్ష్యం నిర్దేశించుకున్నాడు. వారు ఆడుతుంటే అందులోని టెక్నిక్ లను ఒడిసి పట్టుకుని తప్పులు లేకుండా చేసుకునేందుకు ఓనమాలు దిద్దుకున్నాడు. తండ్రి ప్రోత్సాహంతో బ్యాట్మింటన్ లో మెళుకువలు నేర్చుకున్నాడు. జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు గెలుచుకున్నాడు. అనంతరం పారా బ్యాట్మింటన్ వైపు అడుగులు వేశాడు. తాజాగా 2019లో దుబాయ్ వేదికగా పారా బ్యాట్మింటన్ ఇంటర్నేషనల్ పోటీల్లో సింగిల్స్ విభాగంలో పోటీ పడిన ప్రమోద్ స్వర్ణం సాధించాడు.

భారత్ సాధించిన స్వర్ణంతో పతకాల సంఖ్య 17కు చేరింది. వీటిలో నాలుగు స్వర్ణం, ఏడు రజతం, ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి. అయితే ఈసారి పారాలింపిక్స్ లో ఎన్నడు లేని విధంగా పారా అథ్లెట్లు టోక్యో పారాలింక్స్ లో విజృంభించి భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. దేశం గర్వించేలా చేశారు. దేశానికి మంచి పేరు తీసుకొచ్చారు. ఖ్యాతిని పెంచారు.