https://oktelugu.com/

ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ తాజా అప్ డేట్ ఇదే

బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ విశ్వవ్యాప్తమైంది. అందుకే ఆ తర్వాత ప్రభాస్ తీసే సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే అవుతున్నాయి. సాహో కూడా దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. Also Read: ‘ఆర్ఆర్ఆర్’ టీజర్ రెడీ.. అభిమానులకు రాజమౌళి సర్ ప్రైజ్? ఇక సాహో తర్వాత ప్రభాస్ ‘రాధేశ్యామ్’చిత్రంలో నటిస్తున్నారు. కరోనా కారణంగా అది ఆగిపోయింది. ఇక ఆ తర్వాత వరుసగా ప్రభాస్ రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. అందులో ఒకటి ‘ఆదిపురుష్’ కాగా.. రెండోది […]

Written By:
  • NARESH
  • , Updated On : January 11, 2021 / 09:43 PM IST
    Follow us on

    బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ విశ్వవ్యాప్తమైంది. అందుకే ఆ తర్వాత ప్రభాస్ తీసే సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే అవుతున్నాయి. సాహో కూడా దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ టీజర్ రెడీ.. అభిమానులకు రాజమౌళి సర్ ప్రైజ్?

    ఇక సాహో తర్వాత ప్రభాస్ ‘రాధేశ్యామ్’చిత్రంలో నటిస్తున్నారు. కరోనా కారణంగా అది ఆగిపోయింది. ఇక ఆ తర్వాత వరుసగా ప్రభాస్ రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. అందులో ఒకటి ‘ఆదిపురుష్’ కాగా.. రెండోది నాగ్ అశ్విన్ మూవీ.

    ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. వైజయింతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్ డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో అప్ డేట్ తెలిసింది.

    Also Read: తండ్రి అయిన విరాట్ కోహ్లీ.. తొలి సంతానం ఎవరంటే?

    ఈ సినిమాకు విదేశాల నుంచి అంతర్జాతీయ సాంకేతిక బృందం పనిచేయాల్సి రావడం.. వీఎఫ్ఎక్స్ వర్క్ కి సంబంధించి విదేశాల్లోనే చేయాల్సి రావడంతో సినిమా షూటింగ్ 2022లో ప్రారంభం అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేస్తారని.. షూటింగ్ మాత్రం సమ్మర్ నుంచి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి సెట్స్ ను కూడా ప్రస్తుతం శరవేగంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఈ చిత్రంలోని కీలక సీక్వెన్స్ ను ముందుగా తీయాలని చూస్తున్నారట..

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్