సోషల్ మీడియాలో సినీ నటితో మంత్రి రాసలీలలు వైరల్

ఆయన ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి.. బటయకు బాగానే లెక్చర్లు దంచుతాడు. సంఘసంస్కర్త.. సమాజ ఉద్దారకుడిగా కనిపిస్తారు. కానీ చెప్పేవి శ్రీరంగ నీతులు.. చొచ్చేవి ఆ గుడెసెలు అన్నట్టుగా మంత్రి గారి యవ్వారం తాజాగా బయటపడింది. ఓ సినీ నటిపై మోజుపడి తన సన్నిహితురాలితో ఆమెపై వలవేసిన మంత్రిగారి బండారం మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్ సోషల్ మీడియాలో తెలంగాణ మంత్రి రాసలీలలు […]

Written By: NARESH, Updated On : October 30, 2020 8:31 pm
Follow us on

ఆయన ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి.. బటయకు బాగానే లెక్చర్లు దంచుతాడు. సంఘసంస్కర్త.. సమాజ ఉద్దారకుడిగా కనిపిస్తారు. కానీ చెప్పేవి శ్రీరంగ నీతులు.. చొచ్చేవి ఆ గుడెసెలు అన్నట్టుగా మంత్రి గారి యవ్వారం తాజాగా బయటపడింది. ఓ సినీ నటిపై మోజుపడి తన సన్నిహితురాలితో ఆమెపై వలవేసిన మంత్రిగారి బండారం మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

సోషల్ మీడియాలో తెలంగాణ మంత్రి రాసలీలలు చక్కర్లు కొడుతున్నాయి. స్నేహితురాలితో మంత్రి చాటింగ్ వ్యవహారం మొత్తం వైరల్ అయ్యింది. చాటింగ్ లో మంత్రిగారి కోరికలు, వలపు , చిలిపి కోరికలన్నీ బయటపడడం సంచలనమైంది.

Also Read: పోలీసులకు సవాల్‌గా మారిన మిస్సింగ్‌ కేసులు..

తెలంగాణ మంత్రి కోరికలు తీర్చేందుకు సినిమాల్లో నటిస్తున్న మరో యువతితో మంత్రి గారి సన్నిహితురాలు బేరసారాలకు దిగినట్టు ఆ సోషల్ మీడియా చాట్స్ ను బట్టి తెలుస్తోంది. సినిమాల్లో నటించిన ఆ యువతి అంటే మంత్రికి మోజు ఉందని.. మంత్రితో సాన్నిహిత్యం మంచిదంటూ మంత్రిగారి సన్నిహితురాలు సదురు సినీ నటికి వల వేసిందట. ఇలా ఉంటే మంచిదంటూ ఆమె సినీ నటికి ఆఫర్ ఇచ్చిందట..

అయితే మంత్రి గారి కోరిక తీర్చేందుకు సదురు సినీ నటి ససేమిరా అనడంతో ఆమె వ్యక్తిగత చిత్రాలను కూడా రహస్యంగా చిత్రీకరించారని సోషల్ మీడియాలో చాట్స్ ను బట్టి తెలుస్తోంది. ఈ ఫొటోలు తీసే క్రమంలో మంత్రి సన్నిహితురాలితో సినీ నటి గొడవ పడింది. ఆ సినీ నటే మొత్తం మ్యాటర్ అంతా సోషల్ మీడియాలో షేర్ చేసింది. మంత్రి చేసిన చిలిపి స్క్రీన్ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read: ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేసేవారికి శుభవార్త..

మంత్రి గారి బండారం బయటపడిందని తెలిసి సదురు సినీ నటితో రాజీ ప్రయత్నాలు షూరూ చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ అవేవీ వర్కవుట్ కాలేదని.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు స్క్రీన్ షాట్స్ బయటకు రావడంతో మంత్రి గారి సీన్ అంతా రివర్స్ అయ్యిందట..

మంత్రిగారి వ్యవహారం సిన్ టు సీన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రి సన్నిహితురాలితో చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీనిపై మంత్రి మాత్రం స్పందించలేదు. ఖండించలేదు.