https://oktelugu.com/

మెగా హీరోల దండయాత్ర మొదలుకానుందా?

టాలీవుడ్లో మెగా హీరోల హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీని శాసించే స్థాయికి మెగాస్టార్ చిరంజీవి ఎదిగారు. ఆయన బాటలోనే మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలంతా నడుస్తున్నారు. చిరంజీవిలోని కష్టించేతత్వాన్ని మెగా హీరోలంతా అలవర్చుకోవడంతో వారంతా కూడా టాలీవుడ్లో విజయాలు సాధిస్తూ స్టార్ హీరోలుగా క్రేజ్ దక్కించుకుంటున్నారు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ కరోనా కారణంగా టాలీవుడ్లో సినిమాలన్నీ నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే షూటింగులు మొదలవుతుండటంతో అందరిచూపు మెగా హీరోలపైనే […]

Written By:
  • NARESH
  • , Updated On : October 30, 2020 / 05:15 PM IST
    Follow us on

    టాలీవుడ్లో మెగా హీరోల హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీని శాసించే స్థాయికి మెగాస్టార్ చిరంజీవి ఎదిగారు. ఆయన బాటలోనే మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలంతా నడుస్తున్నారు. చిరంజీవిలోని కష్టించేతత్వాన్ని మెగా హీరోలంతా అలవర్చుకోవడంతో వారంతా కూడా టాలీవుడ్లో విజయాలు సాధిస్తూ స్టార్ హీరోలుగా క్రేజ్ దక్కించుకుంటున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    కరోనా కారణంగా టాలీవుడ్లో సినిమాలన్నీ నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే షూటింగులు మొదలవుతుండటంతో అందరిచూపు మెగా హీరోలపైనే పడింది. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోల నుంచే దాదాపు 22చిత్రాలు త్వరలో రానున్నాయని తెలుస్తోంది. దీంతో మెగా హీరోలంతా ఒక్కసారిగా దండయాత్రకు దిగితే మిగతా హీరోలకు థియేటర్లు దొరకుతాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

    Also Read: రాహుల్ సిప్లిగంజ్ ఎమోషనల్ పోస్టు.. పునర్నవి గురించేనా?

    మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత మెహర్ రమేష్ తో ‘వేదళమ్’.. వివి వినాయక్ తో ‘లూసిఫర్’ రీమేక్.. ఆ తర్వాత బాబీ ఓ సినిమా.. ఆ వెంటనే నిర్మాత దిల్ రాజు కాంబినేషన్లో చిరంజీవి సినిమా చేయనున్నాడు. పవన్ కల్యాణ్ సైతం నాలుగైదు సినిమాలతో బీజీగా ఉన్నాడు. పవన్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘ఆఆర్ఆర్’తోపాటు ‘ఆచార్య’లో నటిస్తున్నాడు. త్వరలోనే మరో సినిమాను అనౌన్స్ చేయనున్నాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ మూవీ చేస్తున్నాడు. ఆ వెంటనే కొరటాల శివతో ఓ మూవీ చేయనున్నాడు. సాయిధరమ్
    తేజ్ ఇప్పటికే ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని పూర్తి చేయగా మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు.

    Also Read: రేటింగ్స్ పడిపోతుంటే బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు?

    వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో ఓ మూవీ చేస్తున్నాడు. ‘ఉప్పెన’తో మెగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ దర్శకుడు క్రిష్ తో ఓ సినిమా చేస్తున్నాడు. చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’తోపాటు మరో మూవీని లైన్లో పెట్టాడు. అల్లు శిరీష్ ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాబోయే రోజుల్లో మెగా హీరోలంతా దండయాత్రకు సిద్ధమవుతుండటంతో మిగతా హీరోలంతా ఓటీటీలకే పరిమితం కావాల్సిందనే టాక్ ఇండస్ట్రీలో విన్పిస్తోంది.