https://oktelugu.com/

వర్షకాలంలో వేడివేడి బజ్జీలు తినేవారందరికీ ఇది షాకింగ్ న్యూస్.

ఇది వర్షాకాలం.. వానలకు అస్సలు దాహం వేయదు..చెమట పట్టదు.. వ్యాయామం చేయాలనిపించదు. శారీరక శ్రమ అంతగా ఉండదు..  వాతావరణం చల్లగా ఉండడంతో నోరూరించే వేడి వేడి పదార్థాలను ఎక్కువగా తినాలని అనిపిస్తుంటుంది. కానీ వర్షకాలంలోకానీ, శీతాకాలంలో కానీ నూనెల్లో వేయించిన పదార్థాలను తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తుస్నారు. Also Read: టిఫిన్ తిని స్నానం చేస్తున్నారా.. ఆ ఆరోగ్య సమస్యల బారిన పడినట్టే..? జిహ్వచాపల్యం కోసం ఆహారం తీసుకుంటే అనారోగ్యం పాలవడమే కాకుండా .. బరువు కూడా […]

Written By:
  • NARESH
  • , Updated On : October 30, 2020 / 05:04 PM IST
    Follow us on


    ఇది వర్షాకాలం.. వానలకు అస్సలు దాహం వేయదు..చెమట పట్టదు.. వ్యాయామం చేయాలనిపించదు. శారీరక శ్రమ అంతగా ఉండదు..  వాతావరణం చల్లగా ఉండడంతో నోరూరించే వేడి వేడి పదార్థాలను ఎక్కువగా తినాలని అనిపిస్తుంటుంది. కానీ వర్షకాలంలోకానీ, శీతాకాలంలో కానీ నూనెల్లో వేయించిన పదార్థాలను తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తుస్నారు.

    Also Read: టిఫిన్ తిని స్నానం చేస్తున్నారా.. ఆ ఆరోగ్య సమస్యల బారిన పడినట్టే..?

    జిహ్వచాపల్యం కోసం ఆహారం తీసుకుంటే అనారోగ్యం పాలవడమే కాకుండా .. బరువు కూడా పెరిగిపోతారని వారు హెచ్చరిస్తున్నారు. అలా వర్షకాలంలో బరువు పెరగకుండా ఉండాలంటే.. వేడి వేడి, నూనెలో వేపే బజ్జీలు, సమోసాలు వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.  ఇంకా తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోకుండా ఉండటం మంచిందంటున్నారు. అలాగే పార్టీలకు వెళ్లినా.. అక్కడ వెరైటీలు కంటి ముందు కనిపిస్తున్నా.. మితంగా తినాలిని సూచిస్తున్నారు.

    Also Read: పది పెళ్లిళ్లు చేసుకున్న మహిళ.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..?

    నెయ్యిని మొత్తం పక్కనపెట్టేయాలి. నూనెతో తయారు చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి. రాత్రిపూట మితంగా ఆహారం తీసుకోవాలి. ఒకవేళ మాంసాహారం తీసుకుంటే.. పండ్లు, సలాడ్లు, కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.