https://oktelugu.com/

మెగా లేడిస్ మేకప్ ఛాలెంజ్.. వైరల్

లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లన్నీ వాయిదాపడటంతో సెలబెట్రీలంతా ఇంటికే పరిమితమయ్యారు. కరోనా కాలాన్ని కొందరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుండగా మరికొందరెమో కొత్తకొత్త ఛాలెంజ్ లతో అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పటికే పలురకాల ఛాలెంజ్ లు సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకున్నాయి. ఒకప్పుడు ఐస్ బకెట్ ఛాలెంజ్, బాటిల్ క్యాప్ ఛాలెంజ్ లు ఆకట్టుకోగా ప్రస్తుతం పిల్లో ఛాలెంజ్, ‘ది రియల్ మేన్’ ఛాలెంజ్ వంటివి ట్రెండింగ్లో కొనసాగుతున్నాయి. తాజాగా మెగా లేడిస్ స్టాట్ చేసిన మేకప్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 23, 2020 / 04:55 PM IST
    Follow us on


    లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లన్నీ వాయిదాపడటంతో సెలబెట్రీలంతా ఇంటికే పరిమితమయ్యారు. కరోనా కాలాన్ని కొందరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుండగా మరికొందరెమో కొత్తకొత్త ఛాలెంజ్ లతో అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పటికే పలురకాల ఛాలెంజ్ లు సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకున్నాయి. ఒకప్పుడు ఐస్ బకెట్ ఛాలెంజ్, బాటిల్ క్యాప్ ఛాలెంజ్ లు ఆకట్టుకోగా ప్రస్తుతం పిల్లో ఛాలెంజ్, ‘ది రియల్ మేన్’ ఛాలెంజ్ వంటివి ట్రెండింగ్లో కొనసాగుతున్నాయి. తాజాగా మెగా లేడిస్ స్టాట్ చేసిన మేకప్ ఛాలెంజ్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

    కేసీఆర్ నిరక్ష్యమే.. కరోనా కేసులు పెరగడానికి కారణమా?

    హీరోలంతా ‘ది రియల్ మేన్’ ఛాలెంజ్ లో హుషారుగా పాల్గొంటున్నారు. సందీప్ వంగా ప్రారంభించిన ఈ చాలెంజ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అగ్రనటులంతా ఈ ఛాలెంజ్ లో ఉత్సాహంగా పాల్గొంటూ పలువురు నామినేట్ చేస్తున్నారు. దీంతో ‘ది రియల్ మేన్’ ఛాలెంజ్ హుషారుగా సాగుతూ వైరల్ అవుతోంది. ఇక హీరోయిన్లు పిల్లో ఛాలెంజ్ అంటూ వేసవిలో కుర్రకారును మరింత వేడిక్కిస్తున్నారు. తాజాగా మెగా లేడిస్ మేకప్ ఛాలెంజ్ కు శ్రీకారం చుట్టారు.

    మిస్టరీగా మారిన 52 కేసులు

    మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించింది. ఇందులో చిరంజీవి చిన్న కూతురు, నాగబాబు కూతురు నిహారిక, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తదితరులు కన్పించారు. మేకప్ వేసుకొని కనిపించాలన్నదే కాన్సప్ట్. వీరంతా మేకప్ ముందు.. మేకప్ తర్వాత ఎలా ఉంటారో అనేది వీడియోలో కన్పించారు. బాలీవుడ్ ఫేమస్ సాంగ్ ‘మేర సూట్ పటియాలా కితనోంకొ మార్ డాలా’ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ పాటకు డ్యాన్స్ చేస్తూ హుషారుగా కన్పించారు. సోషల్ మీడియాలో పెద్దగా కనిపించని అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఈ వీడియోలో చాలా యాక్టివ్‌గా డాన్స్ చేస్తూ కనిపించింది. ఈ సాంగ్‌ను నిహారిక డైరెక్ట్ చేసినట్లు సమాచారం. ఈ వీడియోను చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత తన ఇన్ స్ట్రాగ్రామ్లో పోస్టు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.