https://oktelugu.com/

అలీబాబాగా చంద్రబాబు!

ప్రతిపక్ష నేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలీబాబా దొంగల ముఠాగా తయారయ్యారని మంత్రులు కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. విపత్కర సమయంలో ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేపట్టాలని కానీ, రాజకీయాలు చేయడం ప్రతిపక్షాలకు తగదని హితవు పలికారు. విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సోషల్ డిస్టన్స్ పాటిస్తూ విజయవాడలో రూ.100లకే పండ్ల అమ్మకాన్ని ఆయన ప్రారంభించారు. రైతులకు మేలు చేయాలని, నేరుగా రైతు […]

Written By: , Updated On : April 23, 2020 / 04:35 PM IST
Follow us on


ప్రతిపక్ష నేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలీబాబా దొంగల ముఠాగా తయారయ్యారని మంత్రులు కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. విపత్కర సమయంలో ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేపట్టాలని కానీ, రాజకీయాలు చేయడం ప్రతిపక్షాలకు తగదని హితవు పలికారు.

విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సోషల్ డిస్టన్స్ పాటిస్తూ విజయవాడలో రూ.100లకే పండ్ల అమ్మకాన్ని ఆయన ప్రారంభించారు. రైతులకు మేలు చేయాలని, నేరుగా రైతు ఉత్పత్తిదారుల సంగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఫ్రూట్స్ కిట్ అమ్మకం చేపట్టినట్లు చెప్పారు. లాక్డౌన్ నేపథ్యంలో రైతులెవరూ ఇబ్బందులు పడకూడదని సీఎం వైయస్ జగన్ ఆదేశించారన్నారు. సీఎం ఆదేశాల మేరకు గ్రామాల్లోనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. పండ్లకు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. ఆక్వారంగాన్ని ఆదుకుంటున్నామన్నారు.

కరోనా కట్టడికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంటే ప్రతిపక్షాలు పని కట్టుకొని మరి తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు హైదరాబాద్లో కూర్చొని స్కైప్ టీవీల్లో సూక్తులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తీరు మార్చుకోకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని మంత్రులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ కమిషనర్ చిరంజీవి, ఏడి దయాకర్, ఎన్జీవోస్ మరియు వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు..