ఏ ఇద్దరూ మంచిగా కలిసి ఉంటే ఓర్వలేని సమాజం మనది, పాపం ఆ ఓర్వలేని తనం దెబ్బకు ప్రస్తుతం మంచు లక్ష్మి మీద ఒక నింద పడింది. అయితే సినీ జనంలో బాగా వైరల్ అవుతోన్న ఈ న్యూస్ వింటే.. సభ్యసమాజం కూడా సిగ్గు పడాల్సిందే. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి, మంచు లక్ష్మికి మధ్య మంచి అనుబంధం ఉంది. వాళ్ళు ఇప్పటికే తమ ఇంటర్వ్యూల్లో మేము మంచి ఫ్రెండ్స్ అని చాటి చెప్పుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే.
అయితే, ఇద్దరు ఆడవాళ్లు కలిసి మెలిసి తిరుగుతూ మేము మంచి స్నేహితులం అని చెప్పిన తర్వాత కూడా, వారి గురించి బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారంటే.. ఇండస్ట్రీలో ఇలాంటి జనం ఉన్నారా ?. అసలు మంచు లక్ష్మి – రకుల్ అంతలా ఎలా కలిసిపోయారు ? పైగా వీళ్లిద్దరూ కలిసి ఎక్కువుగా సినిమాలు కూడా చేయలేదు కదా ? మరి వీళ్ల మధ్య అంత బలంగా బంధం ఏర్పడటానికి కారణం ఏమిటి ? అసలు వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఏ టైప్ ?
అలాగే వీరి మధ్య బాగా సింక్ అయిన ఎలిమెంట్స్ ఏమిటి ? అంటూ రకరకాలు పెడర్ధాలు వచ్చేలా ప్రశ్నలు సంధిస్తూ మహిళా సమాజమే అసహ్యించుకునేలా సినీ జనంలో కొందరు కామెంట్లు చేస్తున్నారు. పైగా ఈ ఇద్దరి మధ్య బయటకు చెప్పుకోలేని ప్రత్యేకమైన సంబంధం ఉందని, అది అక్రమ సంబంధమే అని నీచమైన కామెంట్లు కూడా ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ మధ్య బాగా వినిపిస్తున్నాయి. ఇలాంటి దిగజారుడు కామెంట్ల గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు.
కానీ, ‘నిప్పు లేనిది పొగ రాదు కదా’ అంటూ వెకిలి నవ్వులతో అదే నిజం అంటూ తీర్మానం చేసే వర్గానికి కనువింపు కలగడానికి ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని చెప్పేందుకే ఈ కామెంట్ల గురించి ప్రస్తావించాల్సి వచ్చింది. ఇక తమ స్నేహం గురించి ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ “నేను లక్ష్మి ఒకే రకంగా ఆలోచిస్తాం. లక్ష్మిని కలిస్తే మేము ఫిట్ నెస్ పైనే ధ్యాస పెడతాం. అలాగే ఎక్కువగా సినిమాలు చూస్తాం. అదే విధంగా ఎక్కువగా వర్కవుట్స్ కూడా చేస్తాం’ అంటూ రకుల్ చెప్పింది. కాబట్టి, వీళ్ళ బంధం పై ఇకనైనా బ్యాడ్ కామెంట్లు చెయ్యకుండా ఉంటారని ఆశిద్దాం.