
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కరోనా బారిన పడ్డారు. కొద్దపాటి లక్షణాలతో తనకు కొవిడ్-19 పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలినట్టు ఆయన ఇవాళ వెల్లడించారు. తన నివాసంలో స్వీయ నిర్భంధంలో ఉంటూనే ఢిల్లీలో పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు యధావిధిగా తన బాధ్యతలు నిర్వహిస్తానని ఆయన వెల్లడించారు. కొద్దిపాటి లక్షణాలతో నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని తెలిపారు. స్వీయ నిర్భందంలో ఉన్నప్పటికీ ఢిల్లీలో పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు విధులు కూడా యధతథంగా నిర్వహిస్తాను అని ఢిల్లీ ఎల్జీ పేర్కొన్నారు.