
వరంగల్ మున్సిపల్ పోలింగ్ ముగిసింది. చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని అధికారులు తెలిపారు. కరోనా కారణంగా ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. 49.25 శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారులు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో 60.38 శాతం పోలింగ్ నమోదయింది. అయితే ఈసారి మాత్రం కొవిడ్ నేపథ్యంలో 11 శాతం పోలింగ్ తగ్గింది. ఎన్నికల నిర్వహణ కోసం 66 డివిజన్లలో మొత్తం 878 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.