‘లా’ చదివి చివరకు గ్లామర్ డోస్ పెంచింది !

హీరోయిన్ మాళవిక శర్మ చాల టాలెంటెడ్. పైగా ఆమె మంచి విద్యావంతురాలు కూడా. చిన్నప్పటి నుండి ఆమెకు చదువు అంటే బాగా ఇష్టం అట. ఆ ఇష్టం వల్లే హీరోయిన్ గా వరుస సినిమాలు వస్తున్నా.. వాటిని కాదు అనుకుని మధ్య మధ్యలో సినిమాలు చేస్తూనే కష్టపడి ‘లా’ పూర్తి చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర బార్ కౌన్సిల్ లో మెంబర్ షిప్ తీసుకొని ఇప్పుడు ‘లా’ కూడా ప్రాక్టీస్ చేస్తూ.. కేసులు కూడా వాదించేస్తోంది. లాయర్ అవ్వడం […]

Written By: admin, Updated On : April 20, 2021 10:27 am
Follow us on

హీరోయిన్ మాళవిక శర్మ చాల టాలెంటెడ్. పైగా ఆమె మంచి విద్యావంతురాలు కూడా. చిన్నప్పటి నుండి ఆమెకు చదువు అంటే బాగా ఇష్టం అట. ఆ ఇష్టం వల్లే హీరోయిన్ గా వరుస సినిమాలు వస్తున్నా.. వాటిని కాదు అనుకుని మధ్య మధ్యలో సినిమాలు చేస్తూనే కష్టపడి ‘లా’ పూర్తి చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర బార్ కౌన్సిల్ లో మెంబర్ షిప్ తీసుకొని ఇప్పుడు ‘లా’ కూడా ప్రాక్టీస్ చేస్తూ.. కేసులు కూడా వాదించేస్తోంది. లాయర్ అవ్వడం అనేది తన చిన్ననాటి కల అని, అందుకే ఎంతో కష్టపడి ఎన్నో కోల్పోయి ‘లా’ చదువుకున్నానని.. చివరకు తన ఆశయాన్ని చేరుకున్నానని తెగ సంబరపడిపోతుంది ఈ యంగ్ బ్యూటీ.

ఇక అటు తన ‘లా’ ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తూ… ఇటు సినిమా ఆఫర్లకి ప్రయత్నాలు చేస్తోందట. కానీ ఒక్కసారి ఫామ్ కోల్పోయాక ఇక మళ్ళీ సినిమాల్లో ఫామ్ లోకి రావాలి అంటే అది అంత తేలికైన విషయం కాదు, పైగా ఒకప్పుడు ఛాన్స్ ఇస్తాం అని పిలిచి మరి చెబితే.. వారికీ నో చెప్పింది. ఇప్పడు వాళ్ళు ఆమెకు నో చెబుతున్నారు. పర్సనల్ గా వెళ్లి కలిసినా లేదమ్మా.. తరువాత చూద్దాంలే అంటూ కొంతమంది దర్శకనిర్మాతలు చెప్పి వెనక్కి పంపించేస్తున్నారట. మొత్తానికి తనకు మళ్ళీ సినిమాల్లో అవకాశాలు రావాలంటే.. ఇంకా గట్టిగా ప్రయత్నాలు చేయాలని అమ్మడు ఫిక్స్ అయింది. అందుకే ఆఫర్ల కోసం హైదరాబాద్ కి మకాం మార్చింది.

పైగా వరుసగా హాట్ హాట్ ఫోటో షూట్ లకు సర్వం సిద్ధం చేసుకుంటుంది. నిజానికి ఇప్పటికే ఆమె ఇన్ స్టాగ్రామ్ వేదికపై హాట్ హాట్ ఫోజులతో కవ్విస్తున్నప్పటికీ.. ఛాన్స్ లు రావాలంటే.. ఆ డోస్ సరిపోదు అని, ఇంకా బోల్డ్ లుక్స్ లో డైరెక్టర్స్ కి కిక్ ఇవ్వాలని అమ్మడు తెగ ఆరాట పడుతుంది. ఏది ఏమైనా చివరకు లాయర్ చదువుకుని కూడా హాట్ ఫోటోషూట్ ల విషయంలో వెనక్కి తగ్గడం లేదు మాళవిక. అందుకే మాళవిక శర్మను డిఫరెంట్ హీరోయిన్ అన్నారు. అన్నట్టు అమ్మడు మొన్న ఈ మధ్య తెలంగాణ హైకోర్టులో ఒక కేసు వాదించింది. కాకపోతే అది గెలవలేదు లేండి.