ముదురు భామ ‘మలైకా అరోరా’ తాజాగా చాల విషయాలు చెప్పుకొచ్చింది. 48 ఏళ్ల వయసులోనూ ఫిట్ నెస్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గని ఈ భారీ బ్యూటీ ప్రతి రోజు వ్యాయామాలతో తెగ బిజీగా గడుపుతోంది. కరోనా సోకి కోలుకున్న ఈ బ్యూటీ, కరోనాని తగ్గించడానికి తనకు వ్యాయామాలు ఎలా ఉపయోగపడ్డాయో వివరంగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చింది.
మలైకా మాటల్లో ‘నేను అదృష్టవంతురాలిని అని అందరూ కామెంట్స్ చేస్తుంటారు. అది నిజమే అని నాకూ అనిపిస్తూ ఉంటుంది. నా లైఫ్ లో ఎన్నో సంఘటనలు నా అదృష్టం వల్లే నాకు జరిగాయి. అయితే, లక్ అనేది ఎప్పుడూ ఉండదు కదా. నాకు కొవిడ్ సోకింది. వైరస్ ను ఎదుర్కొవాలంటే మంచి ఇమ్యూనిటీ ఉండాలి, నాకు వైరస్ సోకిన తరువాత, శారీరకంగా నేను చాలా సమస్యలను ఎదుర్కొన్నాను.
రోజూ ఇంట్లో రెండడుగులు వేయడానికి కూడా చాల కష్టపడ్డాను. నాకు ఆ సమయంలో చాలా నీరసంగా ఉండేది. ఒక విధంగా నాలో ఇక ఏ శక్తి లేదా ? నా సామర్థ్యాన్ని అంతా కోల్పోయానా అనిపించింది. వైరస్ సోకి 10 నెలలు గడిచిన తరువాత కూడా, ఒంటిలో నీరసమనేది అలాగే ఉంది అంటే.. మీరు అర్ధం చేసుకోవచ్చు కరోనా ఎంత ప్రమాదకరమో. అయితే కరోనా తగ్గిన తరువాత వర్కవుట్స్ చేయడానికి మొదటిరోజు నేను చాల ఇబ్బంది పడ్డా, మూడు, నాలుగు రోజులు ఇబ్బందిగా అనిపించినా వర్కౌట్స్ ను అలాగే కొనసాగించాను.
ఎప్పుడైతే నేను వ్యాయామాలు చేసానో ఇక అప్పటి నుండి నాకు మళ్లీ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాననే భావన కలిగింది. నేను కేవలం వర్కవుట్స్ వల్లే శారీరకంగా, మానసికంగానూ బలంగా తయారయ్యాను. అందుకే మన జీవితంలో ఎప్పుడు వ్యాయామాన్ని కోల్పోకూడదు’ అంటూ ఈ ముదురు బోల్డ్ బ్యూటీ సోషల్ మీడియాలో మొర పెట్టుకుంది.