సీనియర్ హీరోయిన్ ‘టబు’కి ఇప్పటికీ ఫుల్ క్రేజ్ ఉంది. వయసు అయిపోయినా.. తనలోని గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు అని చాటి చెప్పడానికి ఈ మధ్య హాట్ ఫోటో షూట్ లతో ఫుల్ గా హడావుడి చేస్తోంది ఈ సీనియర్ బ్యూటీ. అయితే, ఇప్పుడు ఇదంతా ఎందుకమ్మా ? ఇంత చేసేది దేనికమ్మా అంటే.. అవకాశం వస్తే, ఇప్పుడు కూడా తానూ హీరోయిన్ గా నటించడానికి రెడీ అంటూ బోల్డ్ స్టేట్ మెంట్స్ ఇస్తోందట. అందుకే మేకర్స్ కూడా టబు ఉత్సాహాన్ని చూసి ఆమె కోసం కాస్త హద్దు మీరు మరీ మెయిన్ గా యూత్ ను టార్గెట్ చేస్తూ.. వైవిధ్యమైన శృంగార భరిత కథలను రాసే పనిలో పడ్డారట.
ఇక టబు ప్రస్తుతం “భూల్ భూలయ్య 2” అనే హిందీ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ఆమె హీరోకి ఆత్త పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ హీరో. కాగా అల్లుడితో ప్రేమలో పడే పాత్రలో టబు కనిపించబోతుందట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కియారా అద్వానీ. కియారా – టబు ఇద్దరూ పోటీ పడి మరీ నటిస్తున్నారట. ఫిఫ్టీ ప్లస్ లో కూడా ఆమె కియారాని తలా దన్నేలా ఈ సినిమాలో టబు ఫుల్ గ్లామర్ గా కనిపించబోతుంది.
అయితే కార్తీక్ ఆర్యన్ కి కరోనా సోకినట్లు తేలింది. కాగా అంతకు ముందు అతనితో షూటింగ్ లో పాల్గొన్న టబు ప్రస్తుతానికి ఇప్పుడు ఐసోలేషన్ లో ఉంది. తన 50 ఏళ్ళు వయసులో ఆరోగ్యం కోసం మొదటిసారి భయపడుతున్నానని చెబుతుంది టబు. ఇక రెండు రోజులు ఆగి టబు ఆర్టి-పీసీఆర్ టెస్ట్ చేయించుకుంటుదట. అలాగే టబు వ్యాక్సిన్ కూడా వేయించుకోబోతుంది. టబు ప్రస్తుతం ఆంటీ, తల్లి పాత్రలలో తనదైన శైలిలో దూసుకుపోతుంది. గతేడాది ఆమె ‘అల వైకుంఠపురంలో’ తల్లి పాత్రలో కనిపించి మెప్పించింది.