ప్రపంచ వాణిజ్యానికి పెద్ద దెబ్బ.. దీంతో రవాణా బంద్

ప్రపంచ వాణిజ్యానికి పెద్ద దెబ్బ పడింది. అమెరికా, యూరప్-ఆసియా వాణిజ్యానికి ప్రధాన జీవనాడి అయిన సూయజ్ కాల్వలో ఓ అతిపెద్ద సరుకు రవాణా ఓడ ఇరుక్కుపోవడంతో ఇప్పుడు సరుకులతో నౌకలన్నీ కూడా బారులు తీరాయి. 120 మైళ్ల పొడువుండే ఈ కాల్వ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే జల మార్గం. ఇక్కడ నౌక ఇసుకలో ఇరుక్కుపోవడంతో ప్రపంచ వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ నౌకల్లో ఒకటైన ఎవర్ గివెన్ అనే నౌక సూయజ్ […]

Written By: NARESH, Updated On : March 25, 2021 4:59 pm
Follow us on

ప్రపంచ వాణిజ్యానికి పెద్ద దెబ్బ పడింది. అమెరికా, యూరప్-ఆసియా వాణిజ్యానికి ప్రధాన జీవనాడి అయిన సూయజ్ కాల్వలో ఓ అతిపెద్ద సరుకు రవాణా ఓడ ఇరుక్కుపోవడంతో ఇప్పుడు సరుకులతో నౌకలన్నీ కూడా బారులు తీరాయి. 120 మైళ్ల పొడువుండే ఈ కాల్వ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే జల మార్గం. ఇక్కడ నౌక ఇసుకలో ఇరుక్కుపోవడంతో ప్రపంచ వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ నౌకల్లో ఒకటైన ఎవర్ గివెన్ అనే నౌక సూయజ్ కాలవ ఒడ్డున ఇసుక అడ్డంగా ఇరుక్కుపోయింది. దీంతో అటూ ఇటూ రాకపోకలు ఆగిపోయి వందల నౌకలు సముద్రంలోనే ఆగిపోయాయి. రవాణా లేక ఆయా దేశాలకు చమురు సహా సరుకులు అందక ధరలు భగ్గుమంటున్నాయి. 400 మీటర్ల పొడువు, 60 మీటర్ల వెడల్పు గల ఈ నౌక 20వేల కంటైనర్లను మోసుకు వెళుతోంది. ఈఫిల్ టవర్ కంటే పెద్దదట..

ప్రపంచవ్యాపారంలో 12శాతం విలువైన సరుకులు ఈ మార్గం గుండానే రవాణా అవుతుంటాయి. కాల్వ మీదుగా ప్రపంచంలో వినియోగించే 8శాతం ఎల్.ఎన్.జీ సరఫరా అవుతుంది. అరబ్ దేశాల నుంచి చమురు ఐరోపా దేశాలతోపాటు అమెరికాకు వెళ్లాంటే ఈ మార్గమే శరణ్యం.

ఇప్పుడు ఈ భారీ నౌక చిక్కుకుపోవడంతో చమురు నౌకలు నిలిచిపోయి క్రూడాయిల్ ధరలు 2.9శాతం పెరిగాయి. కాల్వ ఒడ్డును ఢీకొని అందులో కూరుకుపోయిన ఈ నౌకను వెలికితీయడానికి యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎంత లేట్ అయితే ప్రపంచానికి అంతనష్టం అని అంటున్నారు. చూడాలి మరీ ఈ నౌక సంగతి ఏమవుతుందో..