https://oktelugu.com/

మహా సముద్రం ఫస్ట్ లుక్: క్రూరంగా కనిపిస్తున్న శర్వానంద్

ఈరోజు టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం విశేషం ఒకటి బయటకు వచ్చింది. హీరో శర్వానంద్ పుట్టినరోజున శుభాకాంక్షలు చెబుతూ ఆయన కొత్త చిత్రం ‘మహా సముద్రం’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. పొట్టి గడ్డంతో రఫ్ లుక్ లో కనిపించిన శర్వానంద్ పడవ ఇంజిన్ వెనుకాల ఉండగా.. చేతిలో ఒక ఖడ్గం లాంటి ఆయుధం.. రక్తం కారుతుండగా బీభత్సంగా కనిపిస్తున్నారు. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 6, 2021 / 02:03 PM IST
    Follow us on

    ఈరోజు టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం విశేషం ఒకటి బయటకు వచ్చింది. హీరో శర్వానంద్ పుట్టినరోజున శుభాకాంక్షలు చెబుతూ ఆయన కొత్త చిత్రం ‘మహా సముద్రం’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది.

    పొట్టి గడ్డంతో రఫ్ లుక్ లో కనిపించిన శర్వానంద్ పడవ ఇంజిన్ వెనుకాల ఉండగా.. చేతిలో ఒక ఖడ్గం లాంటి ఆయుధం.. రక్తం కారుతుండగా బీభత్సంగా కనిపిస్తున్నారు.

    ఈ పోస్టర్ చూస్తే శర్వానంద్ క్రూరంగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అన్ని చోట్ల రక్తపు గుర్తులు ఉన్నాయి. శర్వానంద్ ముఖ కవళికలు కూడా ఆవేశంగానే ఉన్నాయి. పోస్టర్‌లో విగ్రహంగా నిలబడి ఉన్నాడు. ఈ లుక్ చూస్తే అది తీవ్రతగల యాక్షన్ ఎపిసోడ్ నుంచి తీసుకుందని అర్థమవుతోంది.

    పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో పడవలను చూపించడంతో ఈ చిత్రం సముద్రం నేపథ్యంలో సెట్ చేయబడిందని అర్థమవుతోంది. ఈ చిత్రానికి ఆర్ ఎక్స్ 100 మూవీ తీసిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. శర్వానంద్ ను పూర్తిగా భిన్నమైన పాత్రలో చూపిస్తున్నాడట.. తీవ్రమైన ప్రేమ .. యాక్షన్ డ్రామాగా చిత్రం కథ ఉంటుందట.. సిద్ధార్థ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

    అదితి రావు హైదరీ.. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ఈ చిత్రం ట్యాగ్ లైన్ గా ‘ఒక అపురూపమైన ప్రేమ’ అని పెట్టి ఆసక్తి రేపారు.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రం షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. ఆగస్టు 19 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.