రెండు ఎమ్మెల్సీ స్థానాలు.. పది మంది ఇన్‌చార్జ్‌ మంత్రులు

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. దీంతో ఈ రెండు స్థానాలనూ అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే దుబ్బాకలో ఘోర పరాజయం.. జీహెచ్ఎంసీలో ఊహించని ఫలితంతో టీఆర్‌‌ఎస్‌ ఇబ్బందుల్లో పడింది. అటు ప్రజల్లోనూ పార్టీ పట్ల ఆసక్తి రోజురోజుకూ తగ్గుతోంది. ఈ పరిణామాల తర్వాత జరుగుతున్న పట్టభద్రుల ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అధికార పార్టీ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే రెండు స్థానాలకు సుమారు పది మంది […]

Written By: Srinivas, Updated On : March 6, 2021 1:48 pm
Follow us on


తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. దీంతో ఈ రెండు స్థానాలనూ అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే దుబ్బాకలో ఘోర పరాజయం.. జీహెచ్ఎంసీలో ఊహించని ఫలితంతో టీఆర్‌‌ఎస్‌ ఇబ్బందుల్లో పడింది. అటు ప్రజల్లోనూ పార్టీ పట్ల ఆసక్తి రోజురోజుకూ తగ్గుతోంది. ఈ పరిణామాల తర్వాత జరుగుతున్న పట్టభద్రుల ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అధికార పార్టీ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే రెండు స్థానాలకు సుమారు పది మంది మంత్రులకు అనూహ్య బాధ్యతలను కట్టబెట్టారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు.

Also Read: చంద్రబాబుకు చోటు దక్కినా.. పవన్‌కు దొరకకపాయె

క్షేత్ర స్థాయిలో ఓ నలుగురు మంత్రులు మినహా మిగితా మంత్రుల పనితీరుపై ఆశించినంత స్థాయిలో లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయ పార్టీలే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈ సారి పెద్ద ఎత్తున రంగంలో దిగారు. పట్టభద్రులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా విచక్షణతో ఓటేస్తారు కాబట్టి తమ గెలుపు ఖాయమని ప్రతి అభ్యర్థి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రజాక్షేత్రంలో ఉన్న వారితోపాటు పాత్రికేయులు కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీలో నిలుస్తున్నారు.

హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌గర్‌‌తోపాటు వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎన్నికలు ఈనెల 14న జరగనున్నాయి. అందరూ అభ్యర్థులు గెలుపును కోరుకుంటున్నట్టే అధికార గులాబీ పార్టీ కూడా తమ గెలుపు కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికతోపాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజాభిమానాన్ని కోల్పోయిందనే సంకేతాలు వెలువడిన నేపథ్యంలో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపొంది ప్రజలు తమవెంటే ఉన్నారని ఇతర పార్టీలకు గొంతెత్తి చెప్పాలని ప్రణాళికలు రచిస్తోంది గులాబీ పార్టీ. అందులో భాగంగానే మరోసారి సెంటిమెంటుకు ఆజ్యం పోస్తూ కాంగ్రెస్ పార్టీ మూలాలున్న వాణీదేవీని అధికార పార్టీ తరుపున హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ అభ్యర్థిగా చాకచక్యంగా రంగంలో దించారు. ఆమె గెలుపుకోసం ఐదుగురు మంత్రులకు అదనపు బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి కేసీఆర్.

Also Read: బీజేపీ విషయంలో కేటీఆర్‌‌ రూట్‌ మార్చారా.. అందుకే ఇలా అటాక్ చేస్తున్నారా..?

మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస గౌడ్‌తోపాటు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి బాధ్యతలు కట్టబెట్టారు కేసీఆర్‌‌. అటు వరంగల్, ఖమ్మం, నల్లగొండ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, గుంటకండ్ల జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డితోపాటు పువ్వాడ అజయ్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. ఇంత మంది మంత్రుల్లో అందరూ అభ్యర్థుల గెలుపు కోసం క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నారా అన్నది మాత్రం ఉత్కంఠ రేపుతోంది. పది మందిలో కేవలం నలుగురే చురుగ్గా పనిచేస్తూ పార్టీ గెలుపు కోసం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్