రజినీకాంత్, కమల్ హాసన్ కలిస్తే వాళ్లదే తమిళనాడు?

ఇద్దరు ఉద్దండ పిండాలు.. తమిళ సినిమా రంగానికి రెండు కళ్లు. ఒకరేమో విలక్షణ నటసార్వభౌముడు కమల్ హాసన్. ఇంకొకరు మాస్ సూపర్ స్టార్ రజినీకాంత్. కమల్ ఇప్పటికే రాజకీయాల్లోకి రాగా.. రజినీకాంత్ ఇంకా ఊగిసలాడుతున్నారు. ఈ క్రమంలోనే తన స్నేహితుడు రజినీకాంత్ మద్దతు కోసం కమల్ హాసన్ వెళతానని చెప్పడం తమిళ రాజకీయాలను షేక్ చేసింది. వీరిద్దరూ కలిస్తే ఖచ్చితంగా తమిళనాడు రాజకీయం వీరిదే అనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Also Read: రైతుల […]

Written By: NARESH, Updated On : December 2, 2020 10:53 am
Follow us on

ఇద్దరు ఉద్దండ పిండాలు.. తమిళ సినిమా రంగానికి రెండు కళ్లు. ఒకరేమో విలక్షణ నటసార్వభౌముడు కమల్ హాసన్. ఇంకొకరు మాస్ సూపర్ స్టార్ రజినీకాంత్. కమల్ ఇప్పటికే రాజకీయాల్లోకి రాగా.. రజినీకాంత్ ఇంకా ఊగిసలాడుతున్నారు. ఈ క్రమంలోనే తన స్నేహితుడు రజినీకాంత్ మద్దతు కోసం కమల్ హాసన్ వెళతానని చెప్పడం తమిళ రాజకీయాలను షేక్ చేసింది. వీరిద్దరూ కలిస్తే ఖచ్చితంగా తమిళనాడు రాజకీయం వీరిదే అనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: రైతుల ఆందోళనలో దాగివున్న నిజానిజాలు

తమిళనాడు రాజకీయాలను కుదుపు కుదిపే పరిణామం చోటుచేసుకుంది. సినిమాల్లో మిత్రులుగా ఉన్న ఇద్దరూ ఇప్పుడు రాజకీయాల్లోనూ మిత్రత్వం చేయడానికి సిద్ధపడ్డారు. వారు ఎవరో కాదు కమల్ హాసన్, రజినీకాంత్ లు కావడం విశేషం.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ రైతుల ఆందోళనపై తాజాగా ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ స్పందించారు. ‘కేంద్రం రైతుల డిమాండ్లను వినాలని సూచించారు. వారి డిమాండ్లను పట్టించుకోవాలని కేంద్రానికి విన్నవించారు.

Also Read: బ్యాలెట్ పేపర్.. ఈవీఎంలకు కాలం చెల్లిందా?

వచ్చే సంవత్సరం జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ మద్దతు కోరుతానని కమల్ హాసన్ సంచలన ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్ల కోసం అందరి ఇళ్లకు వెళ్లాలని అనుకుంటున్నట్టు కమల్ ప్రకటించాడు. తన మిత్రుడు రజినీకాంత్ ఇంటిని వదిలేస్తానా? అని కమల్ వ్యాఖ్యానించారు.

తమిళనాడు ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు మాత్రమే టైం ఉండడంతో కమల్ హాసన్ జోరు పెంచారు. తన ఫుల్ ఫోకస్ తమిళ పాలిటిక్స్ లో పెట్టారు. తాజాగా మాజీ ఐఏఎస్ సంతోష్ బాబును పార్టీలో చేర్చుకున్నారు. ఇతర రాజకీయ పార్టీల్లోని నేతలను ఆకర్షిస్తున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్