https://oktelugu.com/

టీ అమ్ముతూ నెలకు లక్షల్లో ఆదాయం.. ఎలా సాధ్యమైందంటే..?

కొన్ని వ్యాపారాలు చూడటానికి మనకు చిన్న వ్యాపారాలుగా కనిపిస్తాయి. కానీ ఆ వ్యాపారాలను క్రమశిక్షణతో, తెలివితో చేస్తే లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు. వినడానికి అసాధ్యంగా అనిపించినా కొందరు కష్టపడి శ్రమతో అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటున్నారు. ఉత్తరాఖాండ్ లో ఒక వ్యక్తి టీ అమ్ముతూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. రాష్ట్రంలోని నౌవాడా గ్రామానికి చెందిన దాన్ సింగ్ సంపాదిస్తున్న తీరు నెటిజన్లను సైతం ఆశ్చర్యపరుస్తోంది. లాక్ డౌన్ ముందు వరకు దాన్ సింగ్ ఢిల్లీ మెట్రోలో పని చేశాడు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 7, 2020 / 07:27 PM IST
    Follow us on


    కొన్ని వ్యాపారాలు చూడటానికి మనకు చిన్న వ్యాపారాలుగా కనిపిస్తాయి. కానీ ఆ వ్యాపారాలను క్రమశిక్షణతో, తెలివితో చేస్తే లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు. వినడానికి అసాధ్యంగా అనిపించినా కొందరు కష్టపడి శ్రమతో అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటున్నారు. ఉత్తరాఖాండ్ లో ఒక వ్యక్తి టీ అమ్ముతూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. రాష్ట్రంలోని నౌవాడా గ్రామానికి చెందిన దాన్ సింగ్ సంపాదిస్తున్న తీరు నెటిజన్లను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

    లాక్ డౌన్ ముందు వరకు దాన్ సింగ్ ఢిల్లీ మెట్రోలో పని చేశాడు. అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల అతని ఉద్యోగం పోయింది. ఊహించని విధంగా ఉద్యోగం పోవడంతో దాన్ సింగ్ ను ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఎన్నో ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు. దీంతో చివరకు హెర్బల్ టీ అమ్మడం మొదలుపెట్టాడు. అతని టీ రుచి బాగుండటంతో అనతి కాలంలోనే అతని టీకి డిమాండ్ ఏర్పడింది.

    దాన్ సింగ్ టీ కోసం ఇతర గ్రామాల నుంచి సైతం ప్రజలు రావడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఉత్తరాఖాండ్ అంతటా దాన్ సింగ్ పేరు మారుమ్రోగుతొంది. కరోనా, లాక్ డౌన్ సమయం కావడంతో ప్రజలు సైతం హెర్బల్ టీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కరోనా సమయంలో చాలామంది ఇమ్యూనిటీ బూస్టర్లపై ఆధారపడటంతో దాన్ సింగ్ తెలివిగా హెర్బల్ టీ బిజినెస్ ను ప్రారంభించాడు.

    దాన్ సింగ్ ప్రత్యేకమైన గడ్డితో ఈ హెర్బల్ టీని తయారు చేస్తున్నాడు. టీ ద్వారా రుచితో పాటు ఆరోగ్యం కూడా లభించడంతో ప్రజలు ఈ టీపై ఆసక్తి చూపసాగారు. ప్రస్తుతం ఉద్యోగం కంటే వ్యాపారమే బాగుందని దాన్ సింగ్ చెబుతుండటం గమనార్హం.