https://oktelugu.com/

దీపావళికి స్పెషల్.. బన్నీ – త్రివిక్రమ్ నుండి.. !

టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఏమి చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. ఇక తన యాజమాన్యంలోని ప్రముఖ ఓటిటీ ప్లాట్‌ఫాం ఆహా కోసం అయితే ఈ మధ్య అరవింద్ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే తమన్నాతో ఓ టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షోలో స్టార్ అతిథులు ఆడే కొన్ని సరదా ఆటలు కూడా ఈ షోలో ఉంటాయట. మరోపక్క దీపావళికి 5 ప్రత్యేక షోలను రెడీ చేస్తున్నారు. కాగా తాజాగా […]

Written By:
  • admin
  • , Updated On : November 7, 2020 / 07:42 PM IST
    Follow us on


    టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఏమి చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. ఇక తన యాజమాన్యంలోని ప్రముఖ ఓటిటీ ప్లాట్‌ఫాం ఆహా కోసం అయితే ఈ మధ్య అరవింద్ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే తమన్నాతో ఓ టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షోలో స్టార్ అతిథులు ఆడే కొన్ని సరదా ఆటలు కూడా ఈ షోలో ఉంటాయట. మరోపక్క దీపావళికి 5 ప్రత్యేక షోలను రెడీ చేస్తున్నారు. కాగా తాజాగా ఆహాకి త్రివిక్రమ్ – బన్నీ కలిసి ప్రమోషన్ యాడ్ కూడా చెసారు. ఈ దీపావళికి ఈ యాడ్ ప్రత్యేకంగా విడుదల కానుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    అలాగే వచ్చే సంక్రాంతి కోసం కూడా ఆహాలో చాల ప్రోగ్రామ్స్ ను డిజైన్ చేశారు. మొత్తానికి అల్లు అరవింద్ తన ఓటిటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ కోసం డిజిటల్ కంటెంట్‌ను రూపొందించడానికి పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకుపోతున్నాడు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం ఒక్క అల్లు అరవింద్ కే సాధ్యం అనుకుంటా. పైగా ఆహా కోసం భారీగానే పెట్టుబడులు పెడుతూ మిగిలిన అమెజాన్, జీ5, హాట్ స్టార్ లాంటి దీటుగా ఆహాను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

    Also Read: నంద్యాలలో భారీ ఫైట్ చేయబోతున్న బాలయ్య !

    ఇక తమన్నాకు ఎపిసోడ్‌ కు 8 లక్షలు రెమ్యునిరేషన్ ఇస్తున్నాడట. అలాగే యాంకర్ సుమకు, మిగిలిన నటీనటులు అందరికీ అరవింద్ భారీగానే ఇచ్చి వారి చేత బాగానే షోలు చేయిస్తున్నాడు. అలాగే మంచి కంటెంట్ తో వస్తే చిన్న సినిమాలను కూడా తన ఓటీటీ కోసం కొంటూ ఆ రకంగానూ ఆహాను ముందుకు తీసుకువెళ్తున్నాడు. అలాగే చాలా ఏళ్ల నుండి ఫిల్మ్ స్టూడియో నిర్మించాలనే కోరిక బలంగా ఉంది అరవింద్ కి. అందుకే పక్కాగా ప్రణాళిక వేసుకుని స్టూడియో నిర్మాణంలోకి కూడా రంగంలోకి దిగాడు.