చంద్రుడి వల్లే భూమిపై జీవం.. నాసా శాస్త్రవేత్తల కీలక ప్రకటన!

నాసా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ భూమిపై జీవం ఉండటానికి చంద్రుడే కారణమని తేలింది. 450 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమిపై జీవం ఏర్పడిందని శాస్త్రవేత్తలు తేల్చారు. చంద్రుడి వల్లే ఈ భూమిపై మనుషులతో పాటు ఇతర జీవులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని వెల్లడించారు. భూమిపై జీవం పుట్టుక గురించి మనుషుల్లో అనేక సందేహాలు నెలకొని ఉంటాయి. వేరే ఏ గ్రహంలోనూ భూమిపై ఉన్న విధంగా మనుషులు, […]

Written By: Navya, Updated On : October 18, 2020 10:17 am
Follow us on

నాసా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ భూమిపై జీవం ఉండటానికి చంద్రుడే కారణమని తేలింది. 450 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమిపై జీవం ఏర్పడిందని శాస్త్రవేత్తలు తేల్చారు. చంద్రుడి వల్లే ఈ భూమిపై మనుషులతో పాటు ఇతర జీవులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని వెల్లడించారు. భూమిపై జీవం పుట్టుక గురించి మనుషుల్లో అనేక సందేహాలు నెలకొని ఉంటాయి.

వేరే ఏ గ్రహంలోనూ భూమిపై ఉన్న విధంగా మనుషులు, జంతువులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. ఖగోళ శాస్త్రవేత్తలు జీవం పుట్టుక గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో పరిశోధనలను ప్రారంభించారు. సైన్స్ అడ్వాన్సెస్‌ లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో చంద్రుని అయస్కాంత క్షేత్రం భూమి పుట్టుకకు కారణమైందని తేలింది. ఖగోళ శాస్త్రవేత్తలు కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి, చందమామ దగ్గరగానే ఉండేవని చెబుతున్నారు.

భూమి ఆ సమయంలో రాత్రి గోళంలా ఉండేదని.. సూర్యుని నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ఆ విధంగా జరిగేదని.. చంద్రుని అయస్కాంత క్షేత్రం ఆ రేడియేషన్ ను అడ్డుకోవడం వల్ల భూమిపై జీవం ఏర్పడిందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. నాసా చీఫ్‌ సైంటిస్ట్‌ జిమ్‌ గ్రీన్‌ ఈ విషయాలను వెల్లడించారు. మొదట చంద్రునికి అయస్కాంత క్షేత్రం ఏర్పడగా ఆ తర్వాత భూమిలోపల ఉండే ఖనిజాలు భూమికి అయస్కాంత క్షేత్రం ఏర్పడటానికి కారణమయ్యాయని తెలిపారు

చంద్రుని అయస్కాంత క్షేత్రం భూమిపై జీవం మనుగడకు కారణం కావడంతో పాటు భూమిపై జీవులు శ్వాస తీసుకోవడానికి కూడా కారణమవుతున్నట్టు పేర్కొన్నారు. కాలక్రమంలో చంద్రుడు తన శక్తిని కోల్పోవడం వల్ల భూమిని ప్రభావితం చేయడం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రుడిపై వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల అక్కడ అయస్కాంత క్షేత్రం బలహీనపడి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.