https://oktelugu.com/

ప్రజలను సోమరులను చేస్తున్నారా?

ఉన్నవాడి మీద పన్నులు, లేనివాడికి సబ్సిడీ లు ఇది మన సామ్యవాదం. అంటే ఆస్తిని జాతీయం చేయటం కాకుండా వీలయినంతవరకూ ఆర్ధిక వ్యత్యాసాలు తగ్గించాలనే భావన మన రాజ్యంగకర్తలది. కాని నేడు పరిస్ధితి ఆదుపు తప్పి ఉచితాలు ఇవ్వని ప్రభుత్వాలకు మనుగడే లేదనే స్ధాయికి చేరాయి సబ్సిడీలు. ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలుతో ఉచితానుచితాలు మరచిపోతున్నారు ప్రజలు. టి.విలు, ప్రిజ్లు, వాషింగ్ మెషిన్లు,సైకిళ్ళు,వంటి వాటిని ప్రభుత్వ పథకాలలో చేర్చి మరీ ఇస్తున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఇటీవలే తెలంగాణ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 18, 2020 / 10:42 AM IST
    Follow us on

    ఉన్నవాడి మీద పన్నులు, లేనివాడికి సబ్సిడీ లు ఇది మన సామ్యవాదం. అంటే ఆస్తిని జాతీయం చేయటం కాకుండా వీలయినంతవరకూ ఆర్ధిక వ్యత్యాసాలు తగ్గించాలనే భావన మన రాజ్యంగకర్తలది. కాని నేడు పరిస్ధితి ఆదుపు తప్పి ఉచితాలు ఇవ్వని ప్రభుత్వాలకు మనుగడే లేదనే స్ధాయికి చేరాయి సబ్సిడీలు.

    ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలుతో ఉచితానుచితాలు మరచిపోతున్నారు ప్రజలు. టి.విలు, ప్రిజ్లు, వాషింగ్ మెషిన్లు,సైకిళ్ళు,వంటి వాటిని ప్రభుత్వ పథకాలలో చేర్చి మరీ ఇస్తున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఇటీవలే తెలంగాణ సర్కార్ తెలంగాణలోని ఆడపడుచులందరికీ చీరలు పంపిణీ చేసింది. ఇక వీటికి తోడు సబ్సిడీకే బియ్యం,నూనే,రంజాన్ తోఫా,క్రిస్టమస్ తోఫా, సంక్రాంతి తోఫాలు, సబ్సిడీ కే అన్నం,కందిపప్పు వంటివికూడా తెలంగాణ సర్కార్ అమలు చేస్తోంది. తమిళనా డు,ఆంద్రప్రదేశ్,తెలంగాణా వంటి చోట్ల ఇది మితిమీరింది. ఉచితాలే రాజకీయ పార్టీల ఆజెండా ఆయినది.ఓక పార్టీ కొన్ని ఇస్తే మరొకపార్టీ మరిన్ని ఇస్తున్నాయి.చివరికి ఆన్నీ ఉచితమే ఆయ్యాయి.

    Also Read: మీడియా మితిమీరిపోతోందా..? ప్రభుత్వం అడ్డుకోలేదా!

    మన డబ్బు ఏంతో ప్రభుత్వ డబ్బు కూడా ఆంతే. ఉత్పాదకతలేని ఉచితాలు, ప్రజలు కోరినంత ఉచితాలు, ఆహారం పైనే కాక మిగతా రంగాలలో కూడా సాగుతోంది. పారిశ్రామికులకు, వ్యవసాయానికీ, వృద్ధులకు, వికలాంగులకు, పని చేసే వారికి, చెయ్యని వారికీ ఆనే తేడాలేకుండా ఇవ్వటంతో ప్రభుత్వాలు దివాళాకు చేరాయి. వచ్చేది ఏంత పోయేది ఏంత, దేనిని ఏ రంగంపై ఖర్చుచేయాలనే ఆలోచనే లేదు ప్రభుత్వాలకు.

    మధ్యపాన నిషేధం, ఆవినీతి లేని పాలన, ఉచితంగా పట్టాదార్ పాస్ పుస్తకాలు, సర్టిఫికేట్లకు లంచాలు,ప్రాజెక్టులు,రోడ్ల సక్రమ నిర్వహణ, ఆర్హులైన వారికి సబ్సిడీలు, వ్యవసాయానికి తగిన గిట్టుబాటు రేట్లు, ఉచితవిద్య, వైద్యం, ఇవ్వాలిగానీ సబ్సిడీల పేరుతో యంత్రాంగాన్ని ఆవినీతిమయం చేయరాదు.

    విచక్షణలేని సబ్సిటీలతో వెనుజులా వంటి దేశాలు దివాళా తీశాయి.ఆర్ధిక నిర్వహణకు కొన్ని కొలమానాలుంచుకొని వ్యవస్ధలు పనిచేయాలి. ఆమెరికాలోనే తల్లిదండ్రులు 40 శాతం టాక్సు రూపంలో చెల్లించి తమ పిల్లలకు ఆస్ధి వారసత్వాన్ని ఇవ్వాలి. పన్నులు సక్రమంగా వసూలు చేయటం, వాటిని పారదర్శకంగా ఖర్చు చేయటం, జమాఖర్చుల వివరాలు పబ్లిక్ చేయటం, సరైన పర్యవేక్షణ వంటి చర్యలతో కొంత దుబారా తగ్గించవచ్చు.

    మనది సామ్యవాద దేశమయినా ఉన్నవాని మీద పన్నులు విధించి లేని వారికి ఇవ్వాలని ఉన్నా,ఇలా సామూహిక పందేరాలు భావ్యం కాదు. ప్రజలకు తెలియకుండా సబ్సిడీలుండాలి గాని వాటిని బహిరంగంగా చేసి సోమరులుగా, ప్రతి దానికీ ప్రభుత్వాలపై ఆధారపడేవారుగా చేయరాదు. దుర్వినియెూగమైన ప్రతిపైసా మనదే. ఆప్పుకు మనమే భాద్యత వహించాలి. తమ పార్టీవాడయితే వేలకోట్లు దోచిపెట్టటం, పార్టీకానివారిపై కక్ష్యలు సాధించడం కరెక్ట్ కాదేమో..

    Also Read: ప్రాజెక్టుల్లో వరుస ప్రమాదాలు.. కేసీఆర్ ను వదలడం లేదే?

    మధ్యనిషేధం ఆమలులో ఉన్నప్పుడు పొదుపు రేటు చాలా ఏక్కువ. ధూమపానం,గుట్కాలు, గుర్రపు పందేలు,లాటరీలు వంటి వాటిని నిషేధించవచ్చు.నేడు ఆది లేదు. ఓకవైపు సబ్సిడీ లు వేరొకవైపు ప్రజలపై పన్నులు. పెట్రోలు,డీజల్ మీద దాదాపు 150 శాతం పన్నులు విధిస్తున్నారు. అసంబద్ధమైన పన్నుల విధానాలు. ఆ సంబద్ధంగా పంపిణీలు. ఇలా పందేరాలు చేస్తూ ఉంటే ప్రభుత్వాలకు నిర్వహణా ఖర్చులకే ఆదాయం సరిపోదు. ఆప్పులు చేస్తే వెనుజులా పరిస్దితే. అది గుర్తుంచుకొని తెలుగు ప్రభుత్వాలు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.