
దేశీయ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ అదిరిపోయే పాలసీలను ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది. కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని అనుకునే వాళ్లకు మనీబ్యాక్ పాలసీల ద్వారా మరింత ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. మార్కెట్ లో చాలా రకాల పాలసీలు అందుబాటులో ఉన్నప్పటికీ వినియోగదారులకు మనీ బ్యాక్ పాలసీల ద్వారా అనేక లాభాలు కలుగుతాయి.
తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేసి మెచ్యూరిటీ కాలం తరువాత ఈ పాలసీ ద్వారా ఎక్కువ మొత్తంలో రాబడి సులువుగా సొంతం చేసుకోవచ్చు. రెండు ఆప్షన్లు ఉన్న ఎల్‌ఐసీ న్యూ మనీ బ్యాక్ పాలసీలో 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలలో ఏదో ఒక ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.ఈ పాలసీ ద్వారా పన్ను మినహాయింపు ప్రయోజనాలను సైతం పొందవచ్చు. ప్రీమియం, మెచ్యూరిటీ డబ్బులపై ట్యాక్స్ బెనిఫిట్ ప్రయోజనాలు లభిస్తాయి.
13 సంవత్సరాల వయస్సు నుంచి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ ను తీసుకోవచ్చు. 20 సంవత్సరాల మెచ్యూరిటీ కాలంతో పాలసీని ఎంచుకున్న వాళ్లకు ఐదు సంవత్సరాలకు ఒకసారి 15 శాతం చొప్పున డబ్బులను పొందే అవకాశం ఉంటుంది. 25 సంవత్సరాల పాలసీని ఎంచుకుంటే 20 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉండగా చివరి 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.
ఈ రెండు పాలసీల ద్వారా 10 లక్షల రూపాయల వరకు యాక్సిడెంట్ డెత్ ఇన్సూరెన్స్ కవరేజీ లభిస్తుంది. ఉదాహరణకు 30 సంవత్సరాల వయస్సులో 10 లక్షల రూపాయలకు పాలసీ తీసుకుంటే 25 సంవత్సరాలకు 23 లక్షల రూపాయలు లభిస్తాయి. రోజుకు కేవలం 160 రూపాయలు ఆదా చేయడం ద్వారా 23 లక్షల రూపాయలు సొంతం చేసుకోవచ్చు.