https://oktelugu.com/

ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఒప్పుకున్న పవన్ కళ్యాణ్

ప్రజలు, రాజకీయం తప్ప కేవలం డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నానని బహిరంగంగా ప్రకటించిన పెద్ద మనిషి పవన్ కళ్యాణ్. ఆయనకు ట్విట్టర్ , ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాలున్నా.. ప్రజలకు పిలుపునివ్వడానికి.. రాజకీయానికి తప్పితే ఒక్కసారి కూడా సినిమాలకు వాడుకోని మహా నాయకుడు పవర్ స్టార్. అయితే తొలిసారి ఆయన వెనక్కి తగ్గాడు. నిర్మాతలు, దర్శకుడి కోసం ఇంటర్వ్యూలు ఇవ్వడానికి బయటకొచ్చాడు. పవన్ కళ్యాణ్ తన సినిమాలను ఎప్పుడు చూడాలని ఎవ్వరిని అడగడు.. ప్రోత్సహించడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : March 22, 2021 / 10:40 PM IST
    Follow us on

    ప్రజలు, రాజకీయం తప్ప కేవలం డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నానని బహిరంగంగా ప్రకటించిన పెద్ద మనిషి పవన్ కళ్యాణ్. ఆయనకు ట్విట్టర్ , ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాలున్నా.. ప్రజలకు పిలుపునివ్వడానికి.. రాజకీయానికి తప్పితే ఒక్కసారి కూడా సినిమాలకు వాడుకోని మహా నాయకుడు పవర్ స్టార్. అయితే తొలిసారి ఆయన వెనక్కి తగ్గాడు. నిర్మాతలు, దర్శకుడి కోసం ఇంటర్వ్యూలు ఇవ్వడానికి బయటకొచ్చాడు.

    పవన్ కళ్యాణ్ తన సినిమాలను ఎప్పుడు చూడాలని ఎవ్వరిని అడగడు.. ప్రోత్సహించడు. రాజకీయాలపై న్యూస్ ఛానెల్స్ కు మినహా మీడియా ఇంటర్వ్యూలు అస్సలే ఇవ్వడు. సినిమాలో నటించి దులుపుకుంటాడు తప్పితే అస్సలు ఆ సినిమా చూడాలని బాగుందని ప్రమోషన్లలో పాల్గొనడు. చూస్తే చూడండి.. ఆడితే ఆడింది అని నిర్మాతకే వదిలేస్తాడు.

    కానీ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ మారిపోయాడు. అందరు హీరోల్లా ప్రమోషనల్ ఇంటర్వ్యూలు చేయమని దిల్ రాజు కోరినట్లు సమాచారం. భారీ బడ్జెట్ మూవీ కావడం.. రీఎంట్రీ ఫిల్మ్ కావడంతో పవన్ కళ్యాణ్ తొలిసారి తన సినిమాలకు ప్రమోషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు తెలిసింది.

    “వకీల్ సాబ్” ఏప్రిల్ 9 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్ర బృందంలో ఇప్పటివరకు తమన్, రామజోగయ్య శాస్త్రి , దర్శకుడు వేణు శ్రీరామ్ వంటి సాంకేతిక నిపుణులతోనే మొదటి దశ ప్రచారం చేస్తోంది.

    ఈ చిత్రంలోని ప్రముఖ హీరోయిన్లు శ్రుతి హాసన్, అంజలి మరియు నివేదా థామస్ ఇంకా ప్రమోషన్లలో చేరలేదు. ఏప్రిల్ 3 న జరిగే ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు, తరువాత హీరోయిన్లు ప్రమోషన్లు ప్రారంభిస్తారు.

    విడుదలకు ఒక రోజు ముందు, పవన్ కళ్యాణ్ వీడియో ఇంటర్వ్యూలు చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా ఏ సినిమాను ప్రమోట్ చేయని పవన్ ఫస్ట్ టైం వకీల్ సాబ్ సినిమా కోసం ఒప్పుకోవడం విశేషమని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.