AP High Court: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాజధాని అమరావతిలో అసైన్డ్ రైతుల విషయంలో హైకోర్టు విచారణ నిర్వహించింది. రాజధానిలో అసైన్డ్ రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు వెనక్కి తీసుకుంటూ.. జారీ చేసిన జీవో 316 పై తదనంతర చర్యలను హైకోర్టు నిలిపివేసింది. అసైన్డ్ రైతులకు ఇచ్చిన ప్లాట్లను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను హైకోర్టులో రాజధాని రైతులు సవాల్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇస్తే.. గత ప్రభుత్వం వారికి ప్రభుత్వం […]

Written By: Suresh, Updated On : September 1, 2021 12:36 pm
Follow us on

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాజధాని అమరావతిలో అసైన్డ్ రైతుల విషయంలో హైకోర్టు విచారణ నిర్వహించింది. రాజధానిలో అసైన్డ్ రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు వెనక్కి తీసుకుంటూ.. జారీ చేసిన జీవో 316 పై తదనంతర చర్యలను హైకోర్టు నిలిపివేసింది. అసైన్డ్ రైతులకు ఇచ్చిన ప్లాట్లను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను హైకోర్టులో రాజధాని రైతులు సవాల్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇస్తే.. గత ప్రభుత్వం వారికి ప్రభుత్వం ప్యాకేజీ ఇస్తూ జీవో 41 ని తీసుకు వచ్చిందని కోర్టుకు రైతుల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. జోవో 316 పై తదనంతర చర్యలు నిలిపివేయాలని ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.