టీపీసీసీపై లీకులు.. కుట్ర కోణం ఉందంటున్న సీనియర్లు..!

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడి ఎంపిక ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ఉన్నది ఒక్క పదవీ.. కానీ పదుల సంఖ్యలో కాంగ్రెస్ నేతలు పోటీపడుతున్నారు. పార్టీని సరైన దారిలో పెట్టేందుకు సలహాలు.. సూచనలు ఇవ్వాలనే సీనియర్లే టీపీసీసీ కోసం పట్టుబడుతుండటం అధిష్టానానికి కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది. Also Read: మేయర్ ఎన్నిక.. చెయ్యెత్తి జై కొట్టుడే..! తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు […]

Written By: Neelambaram, Updated On : December 12, 2020 8:11 pm
Follow us on


తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడి ఎంపిక ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ఉన్నది ఒక్క పదవీ.. కానీ పదుల సంఖ్యలో కాంగ్రెస్ నేతలు పోటీపడుతున్నారు. పార్టీని సరైన దారిలో పెట్టేందుకు సలహాలు.. సూచనలు ఇవ్వాలనే సీనియర్లే టీపీసీసీ కోసం పట్టుబడుతుండటం అధిష్టానానికి కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది.

Also Read: మేయర్ ఎన్నిక.. చెయ్యెత్తి జై కొట్టుడే..!

తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు మంచి గుర్తింపు ఉంది. అయితే కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాల వల్లే చేజేతుల కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అధికారాన్ని చేజార్చుకుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్న తరుణంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇంకా గ్రూపు రాజకీయాలతో కొట్టుమిట్టాడుతుండటం గమనార్హం.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గాడినపెట్టాలని అధిష్టానం రెండేళ్లుగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ సీనియర్లే మొకాలడ్డు తున్నారు. ఉత్తమ్ కుమార్ రాజీనామా నేపథ్యంలో కొత్త ఛీఫ్ ను అధిష్టానం ప్రకటించేందుకు సిద్ధమైంది. అయితే ఏకాభిప్రాయంతోనే టీపీసీసీ ఎంపిక ఉండాలని సీనియర్ నేతలు పట్టుబడటంతో ఢిల్లీ పెద్దలు అభిప్రాయం సేకరణ చేపట్టింది.

గత నాలుగురోజులుగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ హైదరాబాద్లోని మకాంవేసి తెలంగాణలోని ముఖ్య నేతలందరికీ నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. అయితే డీసీసీ అధ్యక్షులు చెప్పిన అభిప్రాయాలు సోషల్ మీడియాలో లీకయ్యాయని దీంతో టీపీసీసీ ఎంపికలో కుట్ర జరుగుతోందనే సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఈమేరకు ఠాకూర్ వద్దనే టీపీసీసీ ఆశవహులు పంచాయితీ పెట్టినట్లు తెలుస్తోంది.

Also Read: ‘చిత్రపురి’కి కొత్త బాస్ ఎవరంటే?

కాంగ్రెస్ లోని సీనియర్ నేతల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అలా కాకుండా అధిష్టానం ఇష్టానుసారంగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం పార్టీలో ఉండేది లేదని పలువురు సీనియర్ నేతలు ఠాకూర్ కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీని రెండు చీల్చేందుకు ఏదో కుట్ర కోణం జరుగుతుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేసినట్లు సమాాచారం. ఇక నేటితో అభిప్రాయ సేకరణ ముగియడంతో సాయంత్రం మాణిక్యం ఠాకూర్ ఢిల్లీ వెళ్లనున్నారు. మొత్తానికి టీపీసీసీ ఎంపిక అనేక మలుపులు తిరుగుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిని రేపుతోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్