టీవీ ప్రేక్షకులకు కొత్త తరహాలో వినోదాన్ని పంచడానికి ప్రారంభమైన బిగ్ బాస్ ప్రొగ్రాం దారి మళ్లుతున్నట్లు తెలుస్తోంది. కరోనా ఇంకా తగ్గని సమయంలో ప్రారంభమైన బిగ్ బాస్ 4వ సీజన్ త్వరలో ఫైనల్ కు చేరనుంది. అయితే ఇప్పటి వరకు ఈ షో లో ఎక్కడా ఆకట్టుకునే టాస్క్ లేమీ కనిపించలేదని సగటు బిగ్ బాస్ లవర్స్ అంటున్నారు. వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పెట్టడమే ఇందుకు నిదర్శనం.
Also Read: అమ్మాయి మోసం చేసింది.. బెస్ట్ కమెడియన్ అయిపోయాడు !
గతంతో సాగిన బిగ్ బాస్ లో ప్రేక్షకులకు తెలిసిన వారు కొందరు హౌజ్ లోకి వెళ్లారు. దీంతో వారి అభిమానులతో పాటు మరి కొందరు వారి నటనను ఆసక్తిగా చూసేవారు. కానీ ఈసారి దాదాపు కొత్త కంటెస్టెంట్లను తీసుకురావడమే మొదటగా చేసిన మిస్టేక్ . అయినా గంగవ్వ లాంటి యూ ట్యూబ్ స్టార్లను తీసుకొచ్చినా ఈ షో యూత్ ను ఆకట్టుకోలేకపోయింది. దీంతో మోనాల్, అవినాశ్, నోయల్ లాంటి వారు కష్టపడి ప్రేక్షకులను ఆనందింపజేశారు.
అయితే రాను నారు బిగ్ బాస్ అసలు కాన్సెప్ట్ దారి మళ్లతోందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఏదైనా టెన్షన్ పెట్టే టాస్క్ పెట్టి ఆ టాస్క్ లో కంటెస్టెంట్ల ప్రదర్శనతో ఆకట్టుకోవాలి. తమకున్న నటనకు తోడు అదనంగా ఫర్మామెన్స్ చూపించాలి. అయితే పట్టుకుంటే పట్టుచీర అన్నట్లుగా సాగుతోంది ఈ షో. ఇప్పడు హౌజ్ లో ఉన్నవారు తమ నటక కంటే ఏడుపులు, డ్రామాలు వేస్తుండడం చేస్తున్నారు. ఇక ఆడవారిని తాకరాని చోట తాకుకుంటూ కెమెరాల ముందు తమ నటనను ప్రదర్శిస్తున్నారు.
Also Read: బిగ్ బాస్ : పెద్ద తప్పు చేసిన అభిజీత్.. మంచి ఛాన్స్ మిస్ !
ఏడిస్తే ఓట్లు వేస్తారని, డ్రామా చేస్తే ప్రేక్షకులను ఆకట్టుకుంటారని కొందరు తమకు తోచిన విధంగా గేమ్స్ ఆడుతున్నారు. అయితే షో హైప్ కోసం ఇలాంటావి చేస్తున్నారా..? లేక తమ నటనతో ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారా..? అనే విషయం ప్రేక్షకులకు మాత్రం అర్థం కావడం లేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్